Begin typing your search above and press return to search.

భవిష్యత్తుని ముందే ఊహించిన మహర్షి

By:  Tupaki Desk   |   28 April 2019 4:47 AM GMT
భవిష్యత్తుని ముందే ఊహించిన మహర్షి
X
పైకి ఏవి చెప్పుకున్నా మహర్షి విడుదల రెండు సార్లు వాయిదా పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏప్రిల్ 25 మారిపోవడం వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టింది. అయితే మహర్షి టీమ్ ఇక్కడ భవిష్యత్తుని కూడా అంచనా వేసి తెలివైన నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది.

మొన్న విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ వసూళ్ళ అరాచకాన్ని చూస్తున్నాంగా. ఒకవేళ ముందే ప్లాన్ చేసినట్టు మహర్షి కనక ఒకరోజు ముందు 25నే వచ్చి ఉంటె నువ్వా నేనా అని మల్టీ ప్లెక్సుల స్క్రీన్ల కోసం యుద్ధం చేసే పరిస్థితి ఉండేది. స్టార్ కాబట్టి మహేష్ కు ఎడ్జ్ ఎక్కువగా ఉన్నా క్రేజ్ దృష్ట్యా కార్పోరేట్ మల్టీ ప్లెక్సులు అవెంజర్స్ కే ఎక్కువ ఓటు వేసే అవకాశం ఉండేది. దీని వల్ల ఎంత లేదన్నా మహర్షిపై ప్రభావం పడేది

ఒకరకంగా మహర్షి చాలా సేఫ్ గేమ్ ఆడింది. ఖచ్చితంగా ఏప్రిల్ 25నే రిలీజ్ చేయాలి అనుకుని ఉంటె అదేమంత అసాధ్యమైతే కాదు. గత వారమే ఫస్ట్ కాపీ రెడీ చేసి ఉండేవాళ్ళు. తేది దగ్గర ఉంది కాబట్టి కార్యక్రమాలు ఇంకొంచెం వేగవంతం చేసి డెడ్ లైన్ మీట్ అయ్యే వాళ్ళు. ఇప్పుడా టెన్షన్ లేదు.

మే 9కంతా అవెంజర్స్ హంగామా ఈ స్థాయిలో ఉండదు. రెండు వారాల గ్యాప్ కాబట్టి ఆ లోపే రాబట్టుకోవాల్సింది మొత్తం సూపర్ హీరోస్ పిండేస్తారు. దానికి తోడు హాలీవుడ్ సినిమాలకు పైరసీ బెడద ఎక్కువ. చూసే తీరాలన్న నియమం పెట్టుకున్న ప్రేక్షకుల అంతదాక వెయిట్ చేయరు. సో మే 9 మహర్షి కోసం గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది. మహర్షి ఇలా ఆలోచించడం వల్ల జెర్సీ-మజిలి-కాంచన 3-చిత్రలహరిలకు కూడా హెల్ప్ అయ్యింది. లేదంటే వీళ్ళ స్క్రీన్లు గల్లంతయ్యేవి