Begin typing your search above and press return to search.
టీవీలో మహేష్.. ఫ్యాన్స్ మంగళహారతులు
By: Tupaki Desk | 9 Nov 2015 6:52 AM GMTథియేటర్ల బయట కటౌట్లకు పాలాభిషేకాలు చూశాం.. థియేటర్ లోపల స్క్రీన్ ముందు మంగళహారతులు చూశాం.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. బుల్లితెరపై సినిమా ప్రసారమవుతుంటే టీవీలకు మంగళ హారతులు పట్టి సరికొత్త సంస్కృతికి తెరతీశారు. సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి ఈ ఫొటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
మూడు నెలల కిందట విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘శ్రీమంతుడు’ సినిమా నిన్న సాయంత్రం తొలిసారి బుల్లితెరలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు మహేష్ ఇంట్రడక్షన్ సీన్ సందర్భంగా టీవీలకు మంగళహారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగులో ఇప్పటిదాకా ఎక్కడా చూడని సంప్రదాయమిది.
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ ఫొటోల్ని షేర్ చేసుకుని.. తమ హీరో మీద అభిమానం ఏ స్థాయిలో ఉందో చూశారా అంటూ కామెంట్లు చేసుకున్నారు. ఇక బుల్లితెరపై టీఆర్ పీ రేటింగుల విషయంలో ‘శ్రీమంతుడు’ సరికొత్త రికార్డులు నెలకొల్పి ఉంటుందని అంచనా. ఇప్పటిదాకా మా టీవీలో ప్రసారమైన ‘శ్రీ రామదాసు’ 24 రేటింగ్ తో అగ్ర స్థానంలో ఉంది. దాన్ని ‘శ్రీమంతుడు’ అధిగమించిందో లేదో చూడాలి.