Begin typing your search above and press return to search.

సీమలో మహేష్ బాబు సమస్యేంటి?

By:  Tupaki Desk   |   30 Aug 2019 1:30 AM GMT
సీమలో మహేష్ బాబు సమస్యేంటి?
X
తెలుగులో అత్యధిక ఫాలోయింగ్ - మార్కెట్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకడు. ‘బాహుబలి’ వల్ల ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు కానీ.. అతణ్ని మినహాయిస్తే తెలుగులో ఇప్పుడు అత్యధిక మార్కెట్ ఉన్నది మహేష్ బాబుకే అని చెప్పాలి. ఐతే తెలంగాణ - ఆంధ్రా - అమెరికా - కర్ణాటక.. ఇలా ప్రతి చోటా హైయెస్ట్ రేట్లకు అమ్ముడయ్యే అతడి సినిమాలకు.. రాయలసీమకు వచ్చేసరికి అంతగా డిమాండ్ కనిపించదు. రేటు తక్కువ పలుకుతుంది. దీనికి తోడు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. టాక్ అటు ఇటుగా ఉన్న సినిమాల సంగతి వదిలేయొచ్చు కానీ.. హిట్ - బ్లాక్ బస్టర్‌ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు కూడా అక్కడ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘శ్రీమంతుడు’ తర్వాత రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అయిన మహేష్ సినిమానే లేకపోవడం గమనార్హం.

‘బ్రహ్మోత్సవం’ - ‘స్పైడర్’ సినిమాలు డిజాస్టర్లయ్యాయి కాబట్టి వాటి గురించి వదిలేద్దాం. కానీ బ్లాక్‌ బస్టర్ టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ఏరియాలన్నింట్లో లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమాలు రాయలసీమలో మాత్రం బయ్యర్‌ కు నష్టమే మిగిల్చాయి. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్‌ గ్రాసర్‌ గా నిలిచిన అతడి లేటెస్ట్ మూవీ ‘మహర్షి’కి ఇక్కడ రూ.2 కోట్ల దాకా నష్టం వచ్చిందట. ఓవైపు ప్రభాస్ ‘సాహో’ సినిమా ఇక్కడ రూ.25 కోట్లు రేటు పలికితే.. ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ సినిమాలకు రూ.14-15 కోట్ల మధ్య హక్కులు అమ్ముడవుతుంటే.. మహేష్ సినిమాకు మాత్రం రూ.12 కోట్లు ఇవ్వడానికి కూడా జంకుతున్నారు. ‘మహర్షి’ మీద రూ.12 కోట్ల పెట్టుబడి పెడితే రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’కు ఆ రేటు ఇవ్వడానికి బయ్యర్లెవ్వరూ ముందుకు రావట్లేదు. రూ.10 కోట్లకు అడుగుతున్నారట. మరి మిగతా ఏరియాల్లో మాత్రం హవా సాగిస్తున్న మహేష్ సీమలో మాత్రం ఇలా ఎందుకు వెనుకబడిపోయాడో?