Begin typing your search above and press return to search.

కాస్ట గాట్టిగా చెపుతానంటున్న మహేష్‌

By:  Tupaki Desk   |   26 Oct 2015 6:38 PM GMT
కాస్ట గాట్టిగా చెపుతానంటున్న మహేష్‌
X
ఇప్పటికే ఓసారి దత్తత తీసుకోండి అంటూ స్మూత్‌ గా చెప్పాడు. కట్ చేస్తే అందరూ శ్రీమంతుడు రూటే ఫాలో అవుతున్నారు. ఊళ్లను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు సొసైటీలో ఎప్పటినుండో ఉన్నా కూడా.. సూపర్ స్టార్ మహేష్‌ మెసేజ్‌ ఇవ్వగానే దానికి క్రేజ్‌ పెరిగింది. అదే ఒక సూపర్ స్టార్ చెబితే చారిటీ కూడా ఈ రేంజులో చేస్తారా అనే టైపులో మహేష్‌-కొరటాల శివ ఇంప్రెస్‌ చేశారు.

మరి ఒకసారి ఇచ్చిన ఆ మెసేజ్‌ లు ఒకే దెబ్బతో ఆపాలని అనుకోవట్లేదు మన సూపర్ స్టార్ . అందుకే ఈసారి డోస్‌ పెంచి ఇంకా గట్టిగా చెబుదాం అనుకుంటున్నాడట. అందుకే మురుగుదాస్‌ చెప్పిన కథను వెంటనే ఓకే చేశాడట సూపర్‌ స్టార్‌. ఇప్పటివరకు ఠాగూర్‌, స్టాలిన్‌, తుపాకి, కత్తి వంటి సినిమాల్లో కాస్త గట్టిగానే కమర్షియల్‌ డోస్‌ తో కలిపి సొసైటీకి మాంచి మెసేజ్‌ ఇచ్చిన మురుగ.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌ బాబు తో కలసి ఇంకా గట్టిగా చెప్పడానికే నిశ్చయించుకున్నాడు.

ఇప్పటివరకు నిజం సినిమా తరువాత అసలు సొసైటీకి కరప్షన్‌ వంటి యాంగిల్స్‌ పై మహేష్‌ ఎప్పుడూ మెసేజ్‌ ఇవ్వలేదు. కమర్షియల్‌ హీరోయిజమ్ తోనే అంతా నెట్టు కొచ్చేశాడు. మరి శ్రీమంతుడుతో ట్రెండ్‌ మార్చిన మహేష్‌ ఈసారి ఏ రేంజులో కొట్టి చూపిస్తాడో వేచి చూడాల్సిందే.