Begin typing your search above and press return to search.
మళ్లీ మహేష్ బాబు 14 రీళ్ల సినిమా
By: Tupaki Desk | 2 Jun 2016 4:15 AM GMTమహేష్ బాబేంటి.. ఎవ్వరైనా సాధారణంగా 14 రీళ్ల సినిమానే కదా తీసేది. కొత్తగా ఇందులో విశేషమేముంది అంటారా..? ఇక్కడ మాట్లాడుతోంది సినిమా లెంగ్త్ గురించి కాదులెండి. 14 రీల్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ గురించి. మహేష్ బాబు అత్యంత అభిమానించే నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. ఇందుక్కారణం ‘దూకుడు’. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా నిర్మాతలు తనను ట్రీట్ చేసిన పద్ధతి.. నిర్మాణం విషయంలో వాళ్లు చూపించిన ప్యాషన్.. వాళ్ల ప్లానింగ్.. ప్రమోషన్ అన్నీ కూడా తెగ నచ్చేశాయి మహేష్ కు.
‘దూకుడు’ తన కెరీర్లోనే చాలా స్పెషల్ ఫిలిం అని చాలాసార్లు చెప్పుకున్న మహేష్.. నిర్మాతల మీద కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘దూకుడు’ తర్వాత ఆ బేనర్లో వరుసగా 1 నేనొక్కడినే.. ఆగడు సినిమాలు చేశాడు మహేష్. అవి రెండూ డిజాస్టర్లుగా నిలిచినా సరే.. అనిల్ సుంకర-గోపీ-రామ్ త్రయం మీద మహేష్ నమ్మకం సడలిపోలేదు. ఈ మధ్య వాళ్లు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో రీఎంట్రీ ఇస్తుంటే ఆడియో వేడుకకు కూడా వచ్చి వాళ్లను ఆకాశానికెత్తేశాడు.
తన వల్ల దెబ్బ తిన్న ఈ సంస్థను ఆదుకోవాలనుకున్నాడో లేక మామూలుగానే డీల్ కుదిరిందో కానీ.. 14 రీల్స్ లో మహేష్ మళ్లీ ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడట. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశముంది. ఇంకా దర్శకుడు.. కథ ఏమీ కన్ఫమ్ కాలేదు. జస్ట్ మీ బేనర్లో సినిమా చేస్తా అని మహేష్ కమిట్మెంట్ ఇచ్చాడంతే. ఐతే మహేష్ వీళ్లతో పాటు ‘బ్రహ్మోత్సవం’తో దారుణంగా దెబ్బ తిన్న పీవీపీ వాళ్లకు.. అశ్వనీదత్ కు సైతం కమిట్మెంట్లు ఇచ్చి ఉన్నాడు. మరి వాళ్లతో అయ్యాక 14 రీల్స్ దగ్గరికి వస్తాడా.. లేక ముందు వీళ్లకే సినిమా చేస్తాడా అన్నది చూడాలి.