Begin typing your search above and press return to search.
మహేష్ కోసం రంగంలోకి మరో మాస్ డైరెక్టర్?
By: Tupaki Desk | 2 May 2023 7:00 PM GMTవాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బాబి. ఆచార్య ప్లాప్ తో డీలా పడిపోయిన చిరుకి వాల్తేరు వీరయ్యతో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా తో మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోయారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిసింది. చిరు, రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో కూడా హిట్ అవ్వడం విశేషం.
కాగా, ఈ హిట్ ఆనందంలో, మరో భిన్నమైన కథను బాబి ప్లాన్ చేసుకున్నాడట. అయితే, ఆ కథను కూడా టాలీవుడ్ లోని ఓ సార్ట్ హీరోతో చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఆ స్టార్ హీరో మహేష్ బాబు అని తెలుస్తోంది. ఇప్పటికే బాబి మహేష్ ని కలిసి కథను వినిపించాడట. ఆ కథ మహేష్ కి నచ్చేయడంతో సినిమాకి ఒకే చెప్పేశాడట. దీంతో, బాబి స్క్రిప్ట్ పనిలో పడినట్లు సమాచారం.
వింటేజ్ చిరూని చూపించి,ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించిన బాబి, మహేష్ ని ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మహేష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మరో వైపు రాజమౌళితోనూ సినిమా చేయాల్సి ఉంది.
తివ్రిక్రమ్ సినిమా షూటింగ్ విషయంలో ఈ మధ్య కొన్ని పుకార్లు వినిపించాయి. మహేష్ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. మహేష్ – త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయని , అందుకే సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ ప్రచారం ఫై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అలాంటి పుకార్లు నమ్మద్దని చెప్పారు.
నాగ వంశీ చెప్పిన దాని ప్రకారం తివిక్రమ్ సినిమా సవ్యంగా జరిగి, తొందరగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా బాబి సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత మహేష్ చేయాల్సింది రాజమౌళితో కాబట్టి. రాజమౌళి సినిమా మినిమమ్ రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుంది. ఆయన తీస్తే సినిమా హిట్టు పక్కా, కానీ.. టేకింగ్ కి మాత్రం సమయం ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్రమంలో బాబితో సినిమా పట్టాలెక్కడానికి మరెంత కాలం పడుతుందో. ఆలోపు బాబి మరో హీరోతో సినిమా కూడా చేయవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.