Begin typing your search above and press return to search.
పరశురామ్ తర్వాత గరుడవేగ దర్శకుడితోనూ?
By: Tupaki Desk | 24 Feb 2020 9:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ మార్కెట్ రేంజ్ గురించి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ కాన్సెప్ట్ లు చేయకపో యినా! ఇటీవల సక్సెస్ రేటు తనకు ప్లస్ అవుతోంది. `శ్రీమంతుడు` - `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్ విజయం సాధించగా.. `మహర్షి` - `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలు భారీ వసూళ్లనే సాధించాయి. తాజా గణాంకల దృష్ట్యా అతడి ఎంపికలు మారిపోయాయి. స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ కమర్శియల్ గా ఉండాలి.. డైరెక్టర్ కు ఓ ట్రాక్ రికార్డు ఉండాలి.. ప్రస్తుతం ఫామ్ లో ఉంటేనే అవకాశం. రకరకాల క్యాలిక్యులేషన్స్ మహేష్ కు ఉంటాయి.
అవన్ని కుదిరితేనే మహేష్ అగ్రిమెంట్ సాధ్యం. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ అంటే అంత సులువేమీ కాదు. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ క్లాసిక్ అందించిన సందీప్ వంగ...సుకుమార్ లనే మహేష్ రిజెక్ట్ చేసాడంటే మహేష్ సెలక్షన్ విషయంలో ఎలా వ్యవరిస్తున్నారో? అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మహేష్ కి `గరుడ వేగ` ఫేం ప్రవీణ్ సత్తారు వినిపించిన స్క్రిప్ట్ కు ఒకే చెప్పాడని గుస గుస వినిపిస్తోంది. ప్రవీణ్ వినిపించిన 80 శాతం కథకు మహేష్ ని బాగా ఇంప్రెస్ చేసిందని..బ్యాలెన్స్ కూడా సంతృప్తి పరిస్తే యువ దర్శకుడి ఛాన్స్ అందుకున్నట్లేనన్న ఒక ప్రచారం జరుగుతోంది.
మరి ఇందులో నిజం ఎంత? అన్నది తేలాల్సి ఉంది. ప్రవీణ్ సత్తారు ఎల్ బీ డబ్లూ సినిమాతో దర్శకుడిగా పరిచయమ్యాడు. ఆ తర్వాత చాలా ప్రయోగాలు చేసి ఫెయిలయ్యాడు. చివరిగా గరుడ వేగ విజయంతో ఇండస్ట్రీలో అతని పేరు వినిపించింది. అయితే గరుడ వేగ కథాంశం కూడా ప్రవీణ్ సొంతది కాదు. ఓ యువ రచయిత సాయంతో తయారు చేసినది. అయితే దీన్ని డీల్ చేయడం కోసం ప్రవీణ్ చాలా కసరత్తు చేసాడు. అతడు ఒక్క రాజశేఖర్ ని తప్ప స్టార్ హీరోలెవర్నీ డైరెక్టర్ చేసిన అనుభవం లేదు. మరి ప్రవీణ్ కు మహేష్ అవకాశం ఇవ్వడం అంటే ఆలోచించాల్సిన విషయమే. అలాగే ప్లాప్ ల్లో ఉన్న శ్రీనువైట్లకు కూడా మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడన్న రూమర్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.