Begin typing your search above and press return to search.

పీవీపీకి ఆఫ‌ర్ ఇచ్చిన మ‌హేష్‌?

By:  Tupaki Desk   |   27 May 2016 6:55 AM GMT
పీవీపీకి ఆఫ‌ర్ ఇచ్చిన మ‌హేష్‌?
X
ఒక‌టి కొంటే మ‌రొక‌టి ఫ్రీ అన్న‌ట్టుగా పీవీపీకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు మ‌హేష్‌. పీవీపీ సంస్థ‌లో ఇటీవ‌ల మ‌హేష్ చేసిన బ్ర‌హ్మోత్స‌వం ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరికి ఈ సినిమాతో భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ వ‌ర్గాలు తేల్చి చెప్పాయి. వ‌చ్చిన వ‌సూళ్ల‌నిబ‌ట్టి మ‌హేష్‌ కీ ఆ విష‌యం తెలిసిపోయింది. ఎందుకంటే ఇందులో ఆయ‌న కూడా ఓ నిర్మాణ భాగ‌స్వామి కాబ‌ట్టి! త‌నతో చేసిన సినిమాతో భారీగా న‌ష్ట‌పోతున్న పీవీపీకి ఎలాగోలా సాయం చేయాల‌ని డిసైడ్ అయ్యాడట మ‌హేష్‌.

ఆ మేర‌కు మ‌రో చిత్రాన్ని అదే సంస్థ‌లో చేయాల‌ని ఫిక్స‌యిన‌ట్టు తెలిసింది. మ‌హేష్ నుంచి అలా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందో లేదో వెంట‌నే పీవీపీ క‌థ‌ని చెప్పించిన‌ట్టు స‌మాచారం. ఊపిరితో హిట్టు కొట్టిన వంశీ పైడిప‌ల్లి ఇటీవ‌లే మ‌హేష్‌ కి క‌థ వినిపించాడ‌ట‌. ఆ క‌థ‌ని మ‌హేష్ కూడా ఒప్పుకొన్న‌ట్టు తెలిసింది. క‌థ ఓకే కావ‌డంతో ఆ సినిమాకి సంబంధించిన స‌న్నాహాలు షురూ అయిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఫారిన్‌ లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ వ‌చ్చీ రాగానే మురుగ‌దాస్ సినిమాకోసం రంగంలోకి దిగుతాడు. ఆ సినిమా స‌గం పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్‌ - వంశీ పైడిప‌ల్లి - పీవీపీ క‌ల‌యిక‌లో సినిమా మొద‌ల‌వుతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఈ చిత్రంతోనైనా పీవీపీ గ‌ట్టెక్కుతాడో లేదో చూడాలి. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా మ‌హేష్‌ తో సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్నాడు. ఎట్ట‌కేల‌కి ఆ కోరిక ఈ ర‌కంగా తీర‌బోతోంద‌న్న‌మాట‌.