Begin typing your search above and press return to search.

భారీ సెట్ లో మహేష్ మూవీ షూట్

By:  Tupaki Desk   |   5 Jan 2017 5:38 PM GMT
భారీ సెట్ లో మహేష్ మూవీ షూట్
X
మహేష్ బాబు రీసెంట్ గా స్విట్జర్లాండ్ ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మహేష్ న్యూ ఇయర్ ను అక్కడే సెలబ్రేట్ చేసుకోగా.. రామ్ చరణ్ కూడా మధ్యలో వీళ్ల ఎంజాయ్మెంట్ లో భాగం కావడమే కాదు.. ఫోటోలకు పోజులు ఇచ్చారు కూడా.

ఇప్పుడు హైద్రాబాద్ లో జరగనున్న కొత్త షెడ్యూల్ కు మహేష్ సిద్ధమవుతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి.. ఇది కీలకమైన సెట్ అంటున్నారు. జనవరి 7 నుంచి ప్రారంభించి ఈ సెట్ లో చాలా సీన్స్ తో పాటు ఫైట్స్ ను కూడా కంపోజ్ చేయాల్సి ఉంటుందట. ఈ షెడ్యూల్ కోసం కొన్ని వారాల ముందు నుంచే సెట్ నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఇది చివరి దశకు చేరుకుంది. హైద్రాబాద్ సెట్ లో తీయబోయే పోర్షన్ తో.. మహేష్-మురుగల మూవీ టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిపోనుందని అంటున్నారు.

దీనికి ముందు అహ్మదాబాద్ లో కూడా నాలుగు వారాలపాటు షూటింగ్ చేసిన సూపర్ స్టార్.. అక్కడ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ ప్రచారం జరిగిన తర్వాత.. ప్రస్తుతం ఇప్పుడు సంభవామి అనే సంస్కృత పదాన్ని పేరుగా పెడతారన్న ప్రచారం ఉంది. అయితే.. టైటిల్ విషయంలో యూనిట్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.

మరోవైపు.. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మహేష్ హాజరు కానున్నాడనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. మెగా ఈవెంట్ జరగనున్న రోజునే మహేష్ మూవీ షూట్ రీస్టార్ట్ కానుండడంతో.. షూటింగ్ లోనే బిజీగా ఉండాలట మహేష్.