Begin typing your search above and press return to search.
మహేష్ సినిమాకి మరో కాపీ టైటిలా?
By: Tupaki Desk | 27 Sep 2016 1:30 PM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఓ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత.. రెట్టింపు వేగంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గాను.. రెండు భాషల్లో సినిమా చేసేందుకు మురుగదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సౌతిండియాలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మురుగుదాస్.
ఈ చిత్రంలో మహేష్ బాబు కేరక్టర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని.. కాదు కాదు పవర్ ఫుల్ పోలీస్ అని మరోసారి వార్తలొస్తున్నాయి కానీ.. దీనిపై యూనిట్ వర్గాల నుంచి క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ సినిమా టైటిల్ పై కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం అభిమన్యుడు అనే టైటిల్ ని మురుగ అండ్ టీం పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దేశ న్యాయవ్యవస్థతో పోరాడే కాన్సెప్ట్ అని.. అందకే చట్టంతో పోరాటం టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు మొదట వార్తలొచ్చాయి. అయితే.. ఇది మెగాస్టార్ మూవీ టైటిల్ కావడంతో.. పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఎనిమీ.. వాస్కో డ గామా టైటిల్స్ కూడా వినిపించినా.. మహేష్ శాటిస్ఫై కాలేదు.
ఇప్పుడు అభిమన్యుడు అనే టైటిల్ లో.. అభిమన్యు వరకు కళ్యాణ్ రామ్ వాడేశాడు. ఈ నందమూరి హీరో- కన్నడ హీరోయిన్ రమ్య నటించగా 2003లోనే అభిమన్యు వచ్చాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ టైటిల్ ని.. మహేష్ వాడతాడా అంటే అనుమానమే!