Begin typing your search above and press return to search.

రాజమౌళిని చూసి మహేశ్ నేర్చుకోవాల్సిందేనా.?

By:  Tupaki Desk   |   12 Jan 2020 5:23 AM GMT
రాజమౌళిని చూసి మహేశ్ నేర్చుకోవాల్సిందేనా.?
X
సినిమా ఎంత బాగా తీసినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలి.. జనం చూసేలా ఎప్పుడూ ఏదో మ్యాజిక్ చేయాలి.. అంటే సినిమా విశేషాలు.. పోస్టర్లు.. కటౌట్లు, టీజర్లు, ఇలా ఏదో ఒకటి విడుదల చేస్తే దాని ఊపు వస్తుంది. జనంలోకి వెళ్తే సినిమాపై హైప్ వస్తుంది. అదీ లేకనే ఇప్పుడు మహేశ్ సినిమాలకు పెద్ద మైనస్ అవుతోందన్న చర్చ టాలీవుడ్ లో సాగుతోంది.

సినిమా ప్రమోషన్లు, ఇతర విషయాల్లో మహేశ్ బాబు కచ్చితంగా రాజమౌళిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమా కోసం రాజమౌళి చేయని ప్రయత్నం లేదు. కామిక్స్ - గేమ్స్ - కళా ఖండాలు - చిత్రాలు - పోస్టర్లు - టీజర్లు - ఇంటర్వ్యూలు ఇలా ఒక్కటేమిటీ సినిమా కోసం ఎన్నో వినూత్న ఐడియాలు చేస్తూ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చారు. దేశ, ప్రపంచవ్యాప్తంగా సినిమాకు పిచ్చ క్రేజ్ తీసుకొచ్చారు.

ఇది మహేశ్ బాబుకు కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. తాజాగా ‘సరిలేరు’ నీకెవ్వరూ ప్రయోషన్ విషయంలో మహేష్ వెనుకబడ్డారన్న చర్చ నడుస్తోంది. యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ... మిగతా నటులతో మరోటి.. వెబ్ సైట్లకు ప్రశ్నల జవాబులు అదీ ఇన్ డైరెక్టుగానే ఇచ్చేసి వాటికే పరిమితమైపోయారు. ‘మహర్షి’ సినిమాలా వివిధ న్యూస్ చానెల్స్ కు కూడా మహేష్ తిరిగి ప్రమోషన్ చేయడం.. వీకెండ్ వ్యవసాయం అన్నట్టు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేయ లేదన్న చర్చ నడుస్తోంది.

కోట్లు పెట్టి తీస్తున్న మహేష్ సినిమాలపై కావాల్సినంత ప్రచారం చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సరిలేరుకు ఇంకా ఎక్కువ ప్రచారం చేయకపోవడం మైనస్ అంటున్నారు. సినిమా బృందం వ్యవహరిస్తున్న తీరుతో నిర్మాతలకు నష్టాలు తప్పవన్నచర్చ సాగుతోంది.