Begin typing your search above and press return to search.

మహేష్‌ హెయిర్‌ స్టైల్‌ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:30 AM GMT
మహేష్‌ హెయిర్‌ స్టైల్‌ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు తన ప్రతి సినిమాలో కూడా కొద్ది పాటి తేడాతో మాత్రమే కనిపించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. తన మేకోవర్‌ విషయంలో ముఖ్యంగా లుక్‌ చేజింగ్‌ విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపించడు. కంటెంట్‌ పై ఎక్కువ శ్రద్ద పెడుతూ తను ఎలా ఉంటే అలాగే నటించేందుకు ఆసక్తి చూపిస్తాడు. అప్పుడప్పుడు మీసాలు పెంచడం.. కాస్త జుట్టు పెంచడం వంటివి చేస్తాడు. గతంలో అతిథి సినిమా కోసం జుట్టు పెంచిన మహేష్‌ బాబు మళ్లీ ఇప్పుడు సర్కారు వారి పాట కోసం జుట్టు పెంచుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రీ లుక్‌ లోనే మహేష్‌ బాబు కాస్త ఎక్కువ జుట్టుతో అతిథి లుక్‌ లో కనిపించబోతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయన ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించి తన కొత్త లుక్‌ పై మరింత క్లారిటీ ఇచ్చాడు.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఈ ఏడాది మార్చి నుండి విదేశాలకు వెళ్లని మహేష్‌ ఫ్యామిలీ ఎట్టకేలకు దుబాయి వెళ్లారు. సాదారణంగా నెలకు లేదా రెండు నెలలకు ఫారిన్‌ ట్రిప్‌ వేసే మహేష్‌ ఫ్యామిలీ సారి చాలా గ్యాప్‌ తీసుకుని దుబాయి వెళ్లారు. అక్కడ వారం నుండి పది రోజుల పాటు గడిపి అక్కడ నుండి తిరిగి హైదరాబాద్‌ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ విషయమై ఇప్పటికే ప్లానింగ్‌ అంతా రెడీ అయ్యింది. దుబాయి వెళ్తున్న మహేష్‌ బాబు ఎయిర్‌ పోర్ట్‌ లో మాస్క్‌ పెట్టుకుని కనిపించాడు. ఎప్పటిలాగే మహేష్‌బాబు లుక్‌ అదిరి పోయింది. అద్బుతమైన హెయిర్‌ స్టైల్‌ అంటూ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మరియు ప్రేక్షకుల్లో కూడా చర్చ జరుగుతోంది.