Begin typing your search above and press return to search.
తమిళ ఫ్యాన్స్ కి హ్యాండిస్తున్నాడుగా..
By: Tupaki Desk | 1 Aug 2015 3:35 PM GMTమహేష్ కథానాయకుడిగా నటించిన శ్రీమంతుడు ఈనెల 7న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సైమల్టేనియస్ గా తమిళ వెర్షన్ కూడా రిలీజవుతోంది. అయితే తమిళ వెర్షన్ కి మహేష్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి.
మహేష్ చెన్నయ్ లోనే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. తమిళ భాష పక్కాగా మాట్లాడుతాడు కాబట్టి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇదేదీ నిజం కాదని ప్రిన్స్ ఖండించారు. తమిళ వెర్షన్ కి నేను అనువాదం చెప్పుకోవడం లేదు. ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉన్నా. అందుకే కుదరలేదు.. అని చెప్పుకొచ్చాడు. మహేష్ నటించిన ఓ సినిమా సైమల్టేనియస్ గా తెలుగు, తమిళ్ లో రిలీజవ్వడం ఇదే తొలిసారి. కాబట్టి ప్రచారంలో మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఉన్న కొద్దిపాటి సమయాన్ని డబ్బింగు కోసం కేటాయించలేకపోయాడు.
1నేన్కొక్కడినే సినిమాకి తమిళ్ లో విమర్శకుల ప్రశంసలొచ్చాయి. తంబీలు బాగానే ఆదరించారక్కడ. ఈ సినిమాతో మహేష్ కి అభిమానులు కూడా పెరిగారు. అయితే ప్రిన్స్ ఇప్పటికి డబ్బింగ్ చెప్పకుండా హ్యాండిస్తున్నాడు. మునుముందు మార్కెట్ రేంజ్ పెరిగే క్రమంలో ప్రిన్స్ వాయిస్ ని తంబీలు కూడా వినే అవకాశం ఉంది.