Begin typing your search above and press return to search.

పంచ్ డైలాగుల కాలం పోయిందంటున్న మహేష్

By:  Tupaki Desk   |   8 Aug 2015 10:06 AM GMT
పంచ్ డైలాగుల కాలం పోయిందంటున్న మహేష్
X
ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే పండుగాడు.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పాపులర్ డైలాగుల్లో ఇదొకటి. టాలీవుడ్ లో కొత్త ట్రెండుకు కారణమైన సినిమా ‘పోకిరి’. తెలుగులో పంచ్ డైలాగుల ప్రవాహం మొదలైంది ఆ సినిమాతోనే. మిగతా దర్శకులు, రచయితలందరరూ కూడా ఆ తర్వాత పంచ్ డైలాగులతోనే బండి నడిపించడం మొదలు పెట్టారు. పంచ్ లుంటేనే సినిమా హిట్టు అనే నమ్మకం సినిమా జనాల్లో స్థిరపడిపోయింది. ‘‘సినిమాల ప్రభావం జనాల మీద ఉందో లేదో తెలవదు కానీ.. పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా ఉంది’’ అని స్వయంగా మహేషే ‘ఆగడు’లో మరో పంచ్ డైలాగ్ వేయడం గుర్తుండే ఉంటుంది. ఐతే లెక్కలేనన్ని పంచ్ డైలాగులున్న ‘ఆగడు’ జనాలకు రుచించలేదు.

ఆగడు మాత్రమే కాదు.. పంచ్ డైలుగులున్న సినిమాలేవీ కూడా ఈ మధ్య సరిగా ఆడటం లేదు. ఈ సంగతి మహేష్ కూడా గుర్తించనట్లున్నాడు. తన కొత్త సినిమా ‘శ్రీమంతుడు’లో పంచ్ లేమీ లేవు. అన్నీ అర్థవంతమైన, డెప్త్ ఉన్న డైలాగులే రాశాడు కొరటాల. ఈ సంగతే మహేష్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘పంచ్ డైలాగులతో సినిమాలు తీసే ట్రెండు పోయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. కథలో భాగంగా పంచ్ డైలాగులుంటే పర్వాలేదు కానీ.. డైలాగుల కోసమే సినిమాలు తీయడం.. అవసరం లేకున్నా పంచ్ డైలాగులు పెట్టడం తప్పు. అది నాకూ నచ్చదు. ఇప్పుడు కథే కీలకం. స్టార్ల కంటే కూడా కథే గొప్పది’’ అని మహేష్ చెప్పాడు.