Begin typing your search above and press return to search.

నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు -మహేష్‌

By:  Tupaki Desk   |   23 July 2015 6:15 AM GMT
నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు -మహేష్‌
X
ఆగష్టు 9 ప్రిన్స్‌ మహేష్‌ పుట్టినరోజు. సరిగ్గా బి-డే కి రెండు రోజులు ముందు అంటే ఆగస్టు 7న 'శ్రీమంతుడు' రిలీజవుతోంది. నిన్నటిరోజున మిర్చి మ్యూజిక్‌ అవార్డు వేడుకల్లో సందడి చేసిన ప్రిన్స్‌ కొన్ని ఒక లీడింగ్‌ మీడియా హౌస్‌ తో కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పాడు.. అవి మీకోసం..

శ్రీమంతుడు గురించి?

బలమైన కథ, పాత్రలో నటించాను. నా యాటిట్యూడ్‌ లో ఎనర్జీ ఉంటుంది. దూకుడు, బిజినెస్‌ మేన్‌ చిత్రాలతో పోలిస్తే శ్రీమంతుడులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. అలాగే దూకుడు తర్వాత మళ్లీ అంత హిట్‌ సాంగ్స్‌ ఈ సినిమాకి కుదిరాయి. దేవీశ్రీ సంగీతం బావుందంటూ ప్రశంసలొస్తున్నాయి.

ఇప్పటికి కొత్తేంటి?

ప్రతి సినిమా దేనికదే కొత్త. పోకిరి, ఒక్కడు, దూకుడు, బిజినెస్‌ మేన్‌, సీతమ్మ వాకిట్లో... ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకం. అప్పటికి అవే కొత్త. వాటిలో నిర్ణయించాలన్న ఆలోచన కూడా కరెక్టే. నా ప్రతి సినిమాకి అంచనాలు ఉంటాయి. హిట్టు, ఫట్టుతో సంబంధమే లేదు. అది నా అదృష్టం. నాపై నాకు అంచనాలుంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తుంటా.

అభిమానుల గురించి?

నాన్న అభిమానులు నాక్కూడా అభిమానులే. వారసత్వంగా వచ్చినదే. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ప్రతిసారీ సినిమాలు చేస్తుంటా.

నాన్నగారి గురించి?

ఆయనే నాకు స్ఫూర్తి. ఆదర్శం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే నటనలోకి వచ్చాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన వల్లే. అందుకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను.

మీ ఎంపికలు ఎలా?

స్క్రిప్టును బట్టే ఎంపిక. ఈ విషయంలో తుది నిర్ణయం నాదే. నమ్రత కానీ, నాన్న కానీ కలగజేసుకోరు. పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అప్పటికప్పుడు కథ విని అంగీకరించినవే.

బెస్ట్‌ ఇవ్వాలంటే?

కథ, దాంతో పాటే పాత్ర ఎగ్జయిట్‌ చేయాలి. అప్పుడు నా పాత్రలో లీనమై ది బెస్ట్‌ ఇస్తాను.

చొక్కా విప్పరా?

దర్శకుడు నన్ను ఎలా చూపించాలనుకుంటే అలా కనిపిస్తా. పాత్ర డిమాండ్‌ మేరకు నటిస్తా. చొక్కా విప్పాలి అంటే బాలీవుడ్‌ హీరోలా విప్పేయడానికి రెడీ.

కొరటాల గురించి?

శ్రీమంతుడుగా నన్ను చూపించిన క్రెడిట్‌ తనకే దక్కుతుంది.

లుక్‌ డిజైన్‌ ?

నాకు హెయిర్‌ స్టయిలిష్ట్‌ ఉన్నారు. అలాగే డ్రెస్‌ డిజైనర్‌ కూడా. అంతా వాళ్లే చూసుకుంటారు. దర్శకులతో చర్చించే బాధ్యత వాళ్లదే.

కెరీర్‌ లో స్లో అవుతున్నారు?

ఒకేసారి రెండు సినిమాల్లో చేస్తే నటనలోకి పరకాయం చేయడం కష్టం. అయినా ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా.

మల్టీస్టారర్‌ మళ్లీ చేయరా?

వెంకీతో నాకు బైట కూడా మంచి స్నేహం ఉంది. అందువల్ల సీతమ్మ వాకిట్లో .. చిత్రీకరణ బాగా ఆస్వాధించాను. అలాంటి మల్టీస్టారర్‌ లలో నటించడానికి ఎల్లపుడూ సిద్ధమే. తెలుగులో మరిన్ని రావాల్సి ఉంది.

రాజమౌళితో ఎప్పుడు?

బాహుబలి 2 పూర్తవ్వాలి. ఆ తర్వాత నా సినిమా సెట్స్‌ కెళుతుంది. ఆ క్షణం కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

తమిళ్‌ ఎంట్రీ?

మద్రాస్‌ లో పుట్టి పెరిగినా, నేను తెలుగువాడిని. అందుకే ఇక్కడ నటించడం ఇష్టం. తమిళ్‌ మాట్లాడగలిగినా అక్కడికెళ్లాలని అనుకోలేదు. కెరీర్‌ లో తొలిసారి శ్రీమంతుడు తెలుగు, తమిళ్‌ లో ఒకేసారి రిలీజ్‌కొస్తున్నాయి.

రాజకీయాలు?

నాన్నగారు రాజకీయాలు చేశారు. బావ గల్లా జయదేవ్‌ గుంటూరు పార్లమెంట్‌ సభ్యుడు. కానీ నాకు రాజకీయాలు తెలీవు. ఆసక్తి కూడా లేదు. రావాలనుకోవడం లేదు.