Begin typing your search above and press return to search.

మ‌హేష్ నిండా గూఢ‌చారి జ్ఞాప‌కాలు!

By:  Tupaki Desk   |   4 Aug 2018 6:02 AM GMT
మ‌హేష్ నిండా గూఢ‌చారి జ్ఞాప‌కాలు!
X
ఒక అప్‌ కం హీరో గూఢ‌చ‌ర్యం ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ అయ్యింది. సూప‌ర్‌ స్టార్ల‌కే సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపించావ్ గురూ! అంటూ ఒక‌టే ప్ర‌శంస‌లు. ఇంత‌కీ ఎవ‌రా హీరో? ఏమా క‌థ‌? ప్లీజ్ చెక్ దిస్‌..

గూఢ‌చ‌ర్యం అంటే తొలిగా గుర్తొచ్చే పేరు సూప‌ర్‌ స్టార్ కృష్ణ‌. ఆయ‌న టాలీవుడ్ జేమ్స్ బాండ్ అన్న పేరు తెచ్చుకున్నారు. గూఢ‌చారి 007 వంటి స్పై థ్రిల్ల‌ర్‌ లో న‌టించి తొలి తెలుగు డిటెక్టివ్ హీరోగా రికార్డుల‌కెక్కారు. అయితే ఆ లెగ‌సీని క్యారీ చేయ‌డంలో ప్రిన్స్ మ‌హేష్ త‌డ‌బ‌డ్డాడ‌న‌డంలో సందేహ‌మే లేదు. గూఢ‌చారి ఇన్‌ స్పిరేష‌న్‌ తోనే మ‌హేష్ కెరీర్ ఆరంభంలో `వంశీ` చిత్రంలో న‌టించారు. టామ్ క్రూజ్ మిష‌న్ ఇంపాజిబుల్‌ రేంజు విన్యాసాల‌తో మ‌హేష్ మెరిపించినా ఆ సినిమా మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ జ్ఞాప‌కాల్లోంచి బ‌య‌ట‌కు తెచ్చే బంప‌ర్‌ హిట్లు - ఇండ‌స్ట్రీ హిట్ల‌లో న‌టించిన మ‌హేష్‌ కి మొన్న‌టికి మొన్న `స్పైడర్ ` రూపంలో మ‌రో ఝ‌ల‌క్‌. ఏ.ఆర్‌.రెహ‌మాన్ లాంటి ప్ర‌తిభావంతుడే మ‌హేష్‌ కి స‌రైన హిట్టివ్వ‌లేక‌పోయాడు. అదో చేదుజ్ఞాప‌కంగానే మిగిలిపోయింది. ఆ విష‌యాన్ని కాస్త అటూ ఇటూగా భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్‌ మీట్ల‌లో మ‌హేష్ నేరుగా డ‌యాస్‌ పైనే చెప్పేశారు. గ‌త కొంత‌కాలంగా ఏమైపోతోందోన‌న్న బెంగ‌ను ఆయ‌న క‌న‌బ‌రిచారు. భ‌ర‌త్ స‌క్సెస్‌ తో తిరిగి మ‌న‌సు హాయిగా ఉంద‌ని అన్నారు. అదంతా అటుంచితే మ‌హేష్ లాంటి సూప‌ర్‌ స్టార్‌ ని ఒక స్పై సినిమాలో చూపించి స‌క్సెస్ ఇచ్చే ద‌ర్శ‌కుడే లేక‌పోవ‌డం అన్న‌ది మ‌న దుర‌దృష్టంగా భావించాలి. మ‌హేష్ ఆన్‌ స్క్రీన్ ప్రెజెన్స్ - స్టార్‌ డ‌మ్ దృష్ట్యా అత‌డి స్థాయి ద‌ర్శ‌కుడు ఇంకా త‌గల్లేద‌న్న‌ది ఎంతో వాస్త‌వం. శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సైతం మ‌హేష్‌ తో సినిమా చేయాల‌ని త‌ల‌చి చేయ‌లేక‌పోవ‌డం మ‌రో దుర‌దృష్టం అనే చెప్పాలి.

ప్ర‌స్తుతం ఇంకా మ‌హేష్‌ ని పాత జ్ఞాప‌కాలు వెంటాడుతున్న ఈ టైమ్‌ లో పాయింట్ బ్లాంక్‌ లో గ‌న్ పెట్టాడో యువ‌హీరో. అస‌లు ఎలాంటి అంచ‌నాలు లేని ఓ హీరో గూఢ‌చారిగా స‌క్సెస‌వ్వ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. ఇంత‌కీ ఎవ‌రీ హీరో అంటే న‌వ‌త‌రం ట్యాలెంటు అడివి శేష్ గురించే ఇదంతా. శేష్ గ‌ట్స్‌ తో న‌టించిన స్పై థ్రిల్ల‌ర్‌ గూఢ‌చారికి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ప‌రిశ్ర‌మ నుంచి - కామ‌న్ జ‌నాల నుంచి పొగ‌డ్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ లాంటి అసాధార‌ణ స్టార్‌ డ‌మ్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలో న‌టిస్తే ఇంకెంతో బావుండేదో అన్న మాటా వినిపించింది. మొత్తానికి మ‌హేష్ కి గ‌త జ్ఞాప‌కాలు గుర్తు చేసే సినిమా ఇద‌న్న ప్ర‌శంస గూఢ‌చారికి ద‌క్క‌డం.. ఓ అప్‌ క‌మ్ హీరోగా శేష్‌ కి పెద్ద ప్ల‌స్ అనే చెప్పొచ్చు.