Begin typing your search above and press return to search.
మహేష్ కూడా రెండో భాగం మాటెత్తాడు
By: Tupaki Desk | 18 April 2018 6:29 PM ISTభరత్ అనే నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ లెవెల్ లో జరగడం.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో.. అక్కడ వినిపించిన కొన్ని మాటలు సైడ్ లైన్ అయిపోయాయి. వీటిలో దర్శకుడు కొరటాల శివ చెప్పిన రెండు భాగాల లింక్ కూడా ఉంది.
అసలు ఈ సబ్జెక్టును మహేష్ కు 5 గంటల పాటు నెరేషన్ ఇవ్వడంతో.. సినిమా ఐదు గంటలు తీస్తారా అని మహేష్ అన్నాడని కొరటాల చెబితే.. అదేదో మూవీ మీద హైప్ కోసం చెప్పిన మాట అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు భరత్ అనే నేను ప్రమోషన్స్ లో పాల్గొంటోన్న మహేష్ బాబు కూడా ఇదే మాట చెబుతున్నాడు. ఒక రోజు వచ్చి 2 గంటల పాటు నెరేషన్ ఇచ్చిన దర్శకుడు.. మరో రోజు వచ్చి అంతకంటే ఎక్కువ సేపే చెప్పుకొచ్చాడట. ఇదంతా విన్న తర్వాత.. రెండు భాగాలుగా ఈ సినిమా తీయాలి కదూ అన్నాడట మహేష్.
అయితే.. మొదట ఈ ప్రతిపాదన వచ్చినా.. కొన్ని అంశాల కారణంగా డ్రాప్ కావాల్సి వచ్చిందన్నాడు మహేష్. సమాజం మీద ఎంతో ప్రభావం చూపించే మూవీ అని మహేష్ చెబుతున్నాడు. కానీ మహేష్ కూడా బాహుబలి మాదిరిగా సీక్వెల్ కు ట్రై చేసి ఉండాల్సిందని.. అప్పుడు టాలీవుడ్ సీక్వెల్ కు ట్రెండ్ కు మరింతగా బలం వచ్చేదని అంతా భావిస్తున్నారు. తాను పూర్తి స్థాయిలో ప్రయోగాత్మక చిత్రాలు చేయకపోయినా.. మంచి స్క్రిప్టులను ఎంచుకోవడం.. అలాగే రీమేక్ లు ముట్టుకోకూడదనే అంశాలకు మాత్రం కట్టుబడి ఉంటానన్నాడు సూపర్ స్టార్.