Begin typing your search above and press return to search.
ప్రచారానికే 3 కోట్లు వాడేస్తున్న ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 16 April 2018 1:56 PM IST‘రంగస్థలం’ సినిమా సందడి మెల్లిమెల్లిగా తగ్గుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ‘భరత్ అనే నేను’వైపు తిరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటించడం... అదీ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండడంతో భరత్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ విషయం అటుంచితే... కేవలం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడట ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఈ మధ్యనే బహిరంగ సభ పేరుతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ వేడుక చేసింది చిత్ర బృందం. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచేందుకు నగరంలో ఏకంగా 200 హోర్డింగ్లు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 350 హోర్డింగులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రేంజ్ లో హోర్డింగుల ప్రమోషన్ మాత్రం టాలీవుడ్‌లో కొత్తే. ఇప్పటి దాకా ఎవరూ ఈ రకంగా ప్రచారం చేయలేదు. ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మహేష్ అక్కడి నుంచి రాగానే ఏప్రిల్ 18 నుంచి ప్రచార బాధ్యతలు తీసుకోబోతున్నారు. వచ్చే రెండు మూడు వారాలు టీవీల్లో ఇంటర్వ్యూల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నాడు ప్రిన్స్.
ప్రమోషన్ కోసం మూడు కోట్లు పెట్టడమనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. మారుతి అయితే ఈ బడ్జెట్‌తో ఓ సినిమా తీసేస్తాడు కూడా. అయితే భరత్ మీద నమ్మకంతో డీవీవీ దానయ్య ఈ సాహసం చేస్తున్నాడు. బిజినెస్ కూడా భారీగా అవ్వడంతో ఈ ముఖ్యమంత్రి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే చిట్టిబాబు కలెక్షన్లను దాటేయాల్సిందే.