Begin typing your search above and press return to search.
అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తా -మహేష్
By: Tupaki Desk | 14 April 2018 10:56 AM ISTస్పైడర్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ఎలాగైనా మెప్పించాలని భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కూడా సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
మహేష్ మాట్లాడుతూ.. ఆడియెన్స్ ఎప్పుడు నా నుంచి ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటారు. ఎంతో నమ్మకంతో కాలాన్ని డబ్బును వెచ్చించి వస్తారు. అలాంటి వారిని నిరాశపరచకుడదని ఎక్కువగా ఆలోచిస్తుంటాను. అందుకే ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకుంటాను. ఒక సినిమా సమాజంలో మార్పు తెస్తుంది అంటే అలాంటి కథలను చేయడానికి నేను ముందుంటాను. కానీ అన్నిటిని నేనే మారుస్తాను అని చెప్పలేను. భరత్ అనే నేను సినిమా చూసాక ప్రజల్లో ఒక ఆలోచనలో మార్పు వస్తుందని అనుకుంటున్నా. ఇక రాజకీయాల్లో వెళతారా అని చాలా మంది అంటున్నారు. నాకు సినిమాలే ప్రపంచం. పాలిటిక్స్ గురించి పట్టించుకోను.
వీలైతే సోషల్ మెస్సేజ్ ఇస్తూ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తా. బాహుబలి - అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ని సెట్ చేశాయి. వ్యక్తిగతంగా ఆ సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆడియెన్స్ మైండ్ సెట్ పూర్తిగా చేంజ్ అయ్యింది. అది చాలా గొప్ప విషయం. ఇక దర్శకుడిగా మహేష్ ను చూడొవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏమో చెప్పలేము. యాక్టింగ్ ని ప్రస్తుతం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. డైరెక్షన్ లోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఫ్యూచర్ లో ఉంటుందేమో అనే విధంగా మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయబోయే తన 25వ సినిమా షూటింగ్ జూన్ లో స్టార్ట్ కానుందని మహేష్ తెలిపాడు.