Begin typing your search above and press return to search.
భరత్ రిలీజ్ రోజే ఇన్ని ట్విస్టులా
By: Tupaki Desk | 18 April 2018 9:48 PM ISTకొన్ని భలే కాకతాళీయంగా జరుగుతాయి. ప్రీ ప్లాన్డ్ కాకపోయినా అన్ని మ్యాచ్ చేసి చూసుకున్నప్పుడు అవునా అని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఎల్లుండి విడుదల కాబోతున్న భరత్ అనే నేను రిలీజ్ డేట్ కి కూడా అలాంటివే ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఆ రోజు మహేష్ తల్లి ఇందిరా గారి పుట్టిన రోజు. ఈ విషయాన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు కూడా. ఈ రోజు మహేష్ సోదరి మంజుల కూడా ఇదే విషయాన్నీ నొక్కి చెబుతూ తను కూడా ట్విట్టర్ లో అదే ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేసింది. ఇక ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కొందరు అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజన్న విషయాన్నీ గుర్తు చేయటంతో మహేష్ చిన్న చిరునవ్వుతో స్వీట్ సర్ప్రైజ్ అయ్యారు.
సినిమాలో ఎలాగూ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు కదా మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పెట్టకండి అని స్మార్ట్ గా తప్పించుకున్న మహేష్ అదే రోజు బాబు పుట్టిన రోజు కావడం మరీ మంచిది అని ముక్తాయింపు ఇచ్చేసాడు. ప్రెస్ మీట్ మొత్తం ఉల్లాసంగా గడిపిన మహేష్ రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండటంతో పాటు అడ్వాన్సు బుకింగ్ భారీగా జరగడం ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న నేపధ్యంలో విడుదల అవుతున్న భరత్ అనే నేను రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే రీతిలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మొదటిషో బెంగుళూరులో ఉదయం 5.30 నిమిషాలకు పడనుంది. అంతకంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలు మొదలవుతాయా లేదా అనే దాని గురించి రేపటికి స్పష్టత రానుంది.