Begin typing your search above and press return to search.
మహేష్ తదుపరి సినిమాకు 2 నెలలే..!
By: Tupaki Desk | 21 March 2021 11:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేస్తూ వస్తున్నాడు. ఒకొక్క సమయంలో ఆ ఏడాది సమయం ఇంకాస్త ఎక్కువ కూడా అవుతుంది. సరాసరిగా ఏడాదికి ఒక్కటి చొప్పున సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ బాబు తన తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రాజమౌళితో సినిమా చేయాల్సి ఉండగా దాని కంటే ముందు ఒక చిన్న సినిమాను చేయాలని మహేష్ భావిస్తున్నాడని అందుకోసం అనీల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మహేష్ బాబు అనీల్ రావిపూడితో కాకుండా తన తదుపరి సినిమాను ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ కొత్త దర్శకుడికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే మహేష్ బాబు ఇచ్చాడు. అలాగే బడ్జెట్ కూడా అతి తక్కువ చెప్పాడని తెలుస్తోంది. ఈమద్య కాలంలో మహేష్ బాబు సినిమాల బడ్జెట్ తో పోల్చితే ఆ కొత్త దర్శకుడితో చేయబోతున్న సినిమా బడ్జెట్ దాదాపుగా సగం తక్కువ అంటున్నారు.
స్క్రిప్ట్ నచ్చడంతో ఈ ప్రయోగంను చేసేందుకు మహేష్ ఒకే చెప్పాడని.. రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. రాజమౌళితో సినిమాకు ముందు ఎలాంటి ఫలితం వచ్చినా పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే ఈ ప్రమోగంను మహేష్ చేసేందుకు సిద్దం అయ్యాడని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.