Begin typing your search above and press return to search.

మహర్షి తర్వాత ఏంటి మహేష్

By:  Tupaki Desk   |   27 Nov 2018 12:16 PM GMT
మహర్షి తర్వాత ఏంటి మహేష్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నాడు. ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి చివరి నిమిషం వరకు హడావిడి పడకుండా ఒక నెల ముందే అన్ని పూర్తయ్యేలా దర్శకుడు వంశీ పైడిపల్లి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని యూనిట్ టాక్. ఇక దీని తర్వాత మహేష్ చేయబోయే సినిమా గురించి కొంత అయోమయం నెలకొన్న మాట వాస్తవం. రంగస్థలం చూసాక విపరీతంగా ఇంప్రెస్ అయిపోయి తనకు గతంలో 1 నేనొక్కడినే డిజాస్టర్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి మరీ సుకుమార్ తో చేసేందుకు ఆసక్తి చూపాడు మహేష్. నిర్మాణానికి మైత్రి సంస్థ ముందుకు వచ్చింది. ఆ మేరకు ప్రకటన కూడా వచ్చింది.

కట్ చేస్తే మహేష్ సుక్కుల మధ్య కథకు సంబంధించిన ఒక కామన్ అండర్ స్టాండింగ్ రావడం లేదట. పిరియాడికల్ కాన్సెప్ట్ తో వెళదామని సుక్కు అంటుండగా వద్దు అందరూ అవే చేస్తున్నారు కాబట్టి మనం ఇంకోటేదైనా చేద్దాం అని చెప్పినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇది చాలదు అన్నట్టు ఇదే కథతో సుకుమార్ విజయ్ దేవరకొండను ఒప్పించాడు అనే మరో గాసిప్ కూడా చక్కర్లు కొట్టింది. ఇవన్నీ పక్కన పెడితే మహేష్ అర్జున్ రెడ్డి టైం నుంచే సందీప్ రెడ్డి వంగాతో చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ అతనితో కూడా కథ సమస్యే. ఈ లోపు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అంటూ ముంబైలో బిజీ అయిపోయాడు. మహర్షి పూర్తయ్యే టైంకు కూడా కబీర్ సింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు.

ఒకవేళ తాత్కాలికంగా సుకుమార్ ది లేట్ అయినా ఆ అవకాశం అందిపుచ్చుకునేందుకు సందీప్ రెడ్డి అందుబాటులో ఉండడు. సో మహేష్ ఆ తర్వాత ఎవరితో చేస్తాడనేది భేతాళ ప్రశ్న. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో లాక్ అయిపోయాడు. బోయపాటి గురించి అఖిల్ లేదా చిరు లేదా బాలయ్య అంటూ రకరకాల కాంబోల ప్రచారం జరుగుతోంది. రాజమౌళిని రెండేళ్ల దాకా పలకరించినా లాభం లేదు. కొరటాల శివని చిరు బ్లాక్ చేసుకున్నాడు. మరి మహేష్ వీలైనంత త్వరగా సుకుమార్ తోనే బెస్ట్ స్క్రిప్ట్ వండించడం తప్ప ఇప్పటికైతే మరో ఆప్షన్ కనిపించడం లేదు