Begin typing your search above and press return to search.
మహర్షి బడ్జెట్ పెరగడానికి కారణం?
By: Tupaki Desk | 5 May 2019 1:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ సినిమా అంటేనే బడ్జెట్ అన్ లిమిటెడ్ గా పెరిగిపోతుంటుంది. ఈ విషయంలో గతానుభవాలెన్నో. బ్రహ్మోత్సవం.. స్పైడర్.. భరత్ అనే నేను.. ఇవన్నీ తెరకెక్కించేప్పుడు బడ్జెట్లు అమాంతం పెరిగాయన్న విమర్శలొచ్చాయి. మహర్షి విషయంలోనూ బడ్జెట్ అదుపు తప్పారని ప్రచారమైంది. ఈ సినిమాకి దాదాపు 110-120 కోట్ల మేర బడ్జెట్ పెట్టారని ప్రచారమైంది. అయితే ఇలా అదుపు తప్పడానికి కారణమేంటో మహేష్ చాలా స్పష్టంగా చెప్పారు. మహర్షి విషయంలో రాజీ పడని నిర్మాతలే బడ్జెట్ పెరగడానికి కారణమని అన్నారు. అయితే ఒక మంచి కథ దొరికినప్పుడు క్వాలిటీ పరంగా బడ్జెట్లు పెరిగే వీలుందని మహేష్ స్వీయానుభవంతో చెప్పారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయని తెలిపారు.
నేడు `మహర్షి` ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. నిర్మాతలు కథను నమ్మి గుడ్డిగా వెళ్లినప్పుడు.. బడ్జెట్ పెరగడం అన్నది తప్పలేదని అన్నారు. మహర్షి కథ లో చాలా పెద్ద స్కోప్ ఉంది. న్యూయార్క్ లో సీఈఓ అంటే సీఈఓలాగానే కనబడాలి. అక్కడ హెలీకాఫ్టర్లు.. ఖరీదైన కార్లు వగైరా అక్కడ రేంజ్ లోనే కనబడాలి కానీ వేరేగా కుదరదు. అందుకే బడ్జెట్ పెరిగింది. దీంతో పాటు కొన్ని ఎపిసోడ్స్ డిసెంబర్ లో షూట్ చేయాల్సినవి ఉన్నాయి. ఒక గ్రామం సెట్ వేసి అందులో వేలాది మంది ప్రజల్ని చూపించాలి. ప్రతి రోజూ వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం అయ్యేవారు. అక్కడ సాయంత్రం 5 గంటలకే లైట్ మొత్తం పడిపోయేది. అందువల్ల కూడా మరో పది రోజులు అదనంగా షూటింగ్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల బడ్జెట్ పెరిగింది. ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పెట్టుబడి విషయంలో ఏమాత్రం రాజీ పడని నిర్మాతలు నాకు కుదిరారు. కథను నమ్మి తీసే నిర్మాతలు దక్కడం నా అదృష్టం.. అని అన్నారు.
మీ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ చేసిన సినిమా కదా? అన్న ప్రశ్నకు ఈ సినిమా పెద్ద స్థాయిలో బిజినెస్ చేయడం గర్వంగానే ఉన్నా.. మరోవైపు భయంగానూ ఉందని మహేష్ అన్నారు. 120 కోట్ల బిజినెస్ చేసినప్పుడు 150 కోట్లు తేవాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది.. అని అన్నారు. 150 కోట్ల మార్కెట్ విషయంలో గర్వంగానూ భయంగానూ ఉందని మహేష్ వ్యాఖ్యానించారు.