Begin typing your search above and press return to search.
మహర్షి వాల్యూమ్ పెంచాల్సిందే
By: Tupaki Desk | 19 April 2019 4:17 AM GMTసరిగ్గా ఇంకో 21 రోజుల్లో మహర్షి వచ్చేస్తాడు. చిన్న చిన్న అనుమానాలను సైతం నివృత్తి చేస్తూ స్వయంగా మహేష్ మే 9 డేట్ ని మరోసారి నిర్ధారించడంతో అభిమానులకు టెన్షన్ పూర్తిగా తొలగిపోయింది. కౌంట్ డౌన్ లెక్కబెట్టుకోవడమే పెండింగ్. ఇదిలా ఉండగా ప్రమోషన్ విషయంలో మహర్షి మరీ అంత దూకుడుగా లేడని సోషల్ మీడియా కంప్లయింట్. కారణం లేకపోలేదు.
ఇప్పటిదాకా మహర్షికి సంబంధించి టీజర్ రెండు ఆడియో సింగిల్స్ విడుదలయ్యాయి. దేనికీ మహాద్భుతం అనే ఫీడ్ బ్యాక్ రాలేదు. టీజర్ లో గత సినిమాల పోలికలున్నాయని కామెంట్స్ రాగా దేవి శ్రీ ప్రసాద్ స్థాయిలో పాటలు లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ జస్ట్ ఓకే లా అనిపించడం ఫ్యాన్స్ కు డైజెస్ట్ కావడం లేదు.
సాధారణంగా మహేష్ అనే బ్రాండ్ చాలు ఇంకే ప్రమోషన్ అక్కర్లేదు అంటారు నిర్మాతలు. ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో సం థింగ్ స్పెషల్ అంటేనే న్యూట్రల్ ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే మహర్షి పబ్లిసిటీ వాల్యూమ్ ని పెంచాలి. ఈ రోజు అంతరిక్షం అంచున అనే మరో ఆడియో సింగల్ వదలబోతున్నారు. ఇప్పటికే దాని తాలూకు పోస్టర్ హల్చల్ చేసింది. కాస్ట్యూమ్స్ మరీ గొప్పగా లేకపోయినా ప్రిన్స్ స్టైల్ లో ఆ లోపాలన్నీ కవర్ అయిపోతున్నాయి.
సో ఇప్పుడు అభిమానుల చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ మీద ఉంది. వీటికి సంబంధించిన డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. నెలాఖరులో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మే నెల మహేష్ కు అచ్చిరాదనే నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందనే భరోసా దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంకా గట్టిగా కలిగించాలి. కాబట్టి ఇప్పుడీ ఇరవై రోజులు మహర్షి టీమ్ కు పరీక్ష పెట్టే కాలమే