Begin typing your search above and press return to search.
నో ఫోటోషాప్.. అంతా ఆయనే -మహేష్
By: Tupaki Desk | 1 Feb 2018 5:05 PM GMTన్యాయంగా వర్క్ చేస్తే ఎక్కడైనా మంచి గుర్తింపు ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ దాన్ని ఆచరించే వారు చాలా తక్కువమంది ఉంటారు. తన దగ్గర వర్క్ చేసే వ్యక్తి నచ్చితే ఎలాంటి పరిస్థితుల్లోను స్టార్స్ అస్సలు వదులుకొడు. అలాగే మహేశ్ బాబు కూడా తన దగ్గర గత 24 ఏళ్లుగా వర్క్ చేస్తోన్న ఒక వ్యక్తిని కూడా ఏ మాత్రం వదులుకోవడం లేదు. ఏ దర్శకుడితో సినిమా చేసినా కూడా మహేష్ కు ఆ వ్యక్తి ఉండాల్సిందే.
అతను లేనిదే నేను కెమెరాను ఫేస్ చేయలేను అని మహేష్ చెప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు.. అతను ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో. అతని పేరు పట్టాభి. మహేష్ సినిమాలకు మేకప్ మెన్. ఎన్నో ఏళ్లుగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో పాటు కొనసాగుతున్నాడు. అయితే ఆయన కథానాయకుడిగా చేసిన ప్రతి సినిమాలో మహేష్ కి పట్టాభి టచ్ అప్ పడాల్సిందే. ఆయన పక్కనే ఉండి తీరాల్సిందే. 24 ఏళ్ల వరకు కొనసాగుతున్న ఈ ప్రయాణం గురించి మహేష్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఓల్డ్ ఫోటోని పోస్ట్ చేస్తూ చెప్పాడు. అందులో కృష్ణ గారు కూడా ఉన్నారు.
"ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ తో పోజింగ్..అతను నాతోనే గత 24 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. అతను లేకుంటే కెమెరాను ఫేస్ చేయలేను. నో ఫొటోషాప్..మై ఫెవేరేట్ కలర్..మై మాన్ ఇన్ బ్లూ - పట్టాభి" అంటూ మహేష్ తన మేకప్ మ్యాన్ గురించి చాలా స్వీట్ గా చెప్పాడు.