Begin typing your search above and press return to search.
మహేష్ కు కలిసిరాని సంక్రాంతి సీజన్?
By: Tupaki Desk | 19 Jan 2020 9:58 AM GMTఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని సీజన్లు కొంతమందికి పెద్దగా కలిసిరావు. కొన్ని సీజన్లలో రిలీజ్ చేస్తే చాలు హిట్ గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయమే తీసుకుంటే సమ్మర్ సీజన్లో మహేష్ కు మంచి హిట్లు ఉన్నాయి కానీ సంక్రాంతి సీజన్ మహేష్ కు పెద్దగా కలిసిరాలేదు.
2013 లో సంక్రాంతి సీజన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ కాగా ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కానీ సినిమా భారీ హిట్ అయితే కాదు. పోటీలో రిలీజ్ అయిన రామ్ చరణ్ 'ఎవడు' తో కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక 2014 సంక్రాంతికి విడుదలైన '1- నేనొక్కడినే' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ కా బాప్ అని ప్రచారం చేసుకుంటున్నారు కానీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చెయ్యలేదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మహేష్ సంక్రాంతి సినిమాల పరిస్థితి పస తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టుగా ఉందని.. అసలు సంక్రాంతి మహేష్ కు కలిసిరాలేదని అంటున్నారు.
వాస్తవ పరిస్థితి గ్రహించకుండా ఉన్నదానికంటే ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉంటే మహేష్ ఇమేజ్ కి నష్టం జరుగుతోందని అంటున్నారు. అసలే ఇది సోషల్ మీడియా జేనరేషన్.. మా సినిమా హిట్టు హిట్టు అంటే అది హిట్టు అని నమ్మడం లేదు. పది సక్సెస్ మీట్లు పెట్టినా హిట్టు అని నమ్మడం లేదు. నిజమేంటో ప్రేక్షకులకు ఎవరూ చెప్పకుండానే అర్థం అవుతోంది. రియల్ కలెక్షన్స్ సాధించి బయ్యర్లు హ్యాపీగా ఉంటేనే హిట్టు అని లెక్క. ఈ సింపుల్ లాజిక్ ను ఎందుకో ఫిలిం మేకర్లు మిస్సవుతున్నారు