Begin typing your search above and press return to search.

వారం రోజులుగా నిద్ర లేదు-మహేష్

By:  Tupaki Desk   |   25 Sep 2017 6:24 AM GMT
వారం రోజులుగా నిద్ర లేదు-మహేష్
X
తన కెరీర్లో ఎన్నడూ లేనంత టెన్షన్ ‘స్పైడర్’ రిలీజవుతుంటే.. కలుగుతోందని అన్నాడు మహేష్ బాబు. ‘స్పైడర్’ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. తాను సరిగా నిద్ర పోయి వారం రోజులైందని మహేష్ అన్నాడు. చెన్నైలో ‘స్పైడర్’ ప్రమోషన్లలో భాగంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న మహేష్.. చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

‘‘నా గుండె మామూలుగా కంటే పది బీట్స్ ఎక్కువగా కొట్టుకుంటోంది. అసలు వారం రోజుల నుంచి నాకు సరిగా నిద్ర లేదు. మా టీం అందరి పరిస్థితి అంతే. ‘స్పైడర్’ మరిచిపోలేని సినిమా. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకం. మురుగదాస్ లాంటి దర్శకుడితో పని చేయడం జీవిత కాలం గుర్తుంచుకునే అనుభవం. మా టీం అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఈ సినిమా మొదలై పూర్తయ్యే లోపు మా టీంలో అందరూ రెండేసి పుట్టిన రోజులు జరుపుకున్నారు. దీన్ని బట్టే మేం ఎంత కష్టపడ్డామో అర్థం చేసుకోవచ్చు. సరైన సినిమాతో తమిళ తెరకు పరిచయమవుతుండటం చాలా సంతోషంగా ఉంది.

ఇలాంటి సినిమాను నిర్మించాలంటే గట్స్ ఉండాలి. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్.. ఠాగూర్ మధులకు అది ఉంది. రకుల్ ప్రీత్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఎప్పుడడిగితే అప్పుడు డేట్లు ఇచ్చింది. నాకు తమిళం తెలుసు కాబట్టి నాకు తమిళ వెర్షన్ చేయడం ఈజీనే. కానీ రకుల్ కు తమిళం రాకపోయినా చాలా బాగా మేనేజ్ చేసింది. సంతోష్ శివన్ గారితో పని చేయడం నా కల. ఆయన్ని ఇంతకుముందు అడిగితే.. తెలుగు దర్శకులతో తనకు సింక్ కాదన్నారు. కానీ ఇప్పుడు మురుగదాస్ వల్ల సంతోష్ గారితో పని చేయాలన్న కల కూడా తీరింది’’ అని మహేష్ తెలిపాడు.