Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేసే ఆలోచనలో లేడా...?

By:  Tupaki Desk   |   14 April 2020 3:30 PM GMT
మహేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేసే ఆలోచనలో లేడా...?
X
ఇప్పటి హీరోలలో 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి' అని ఆలోచించే వారిలో మహేష్ బాబు ఒకరు. హీరోగా కొనసాగుతూనే బిజినెస్ మ్యాన్ గా మరి ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. కాగా, వరుస హిట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని.. ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్‌ ‘ఆహా’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ లోకి వచ్చిన నేపథ్యంలో మహేశ్‌ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఒక వార్త బయటకి వచ్చింది.

సూపర్ స్టార్ సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేయబోతున్నాడనే వార్త నిజం కాదని.. ఇప్పట్లో అటు వైపు అడుగులు వేసే అవకాశం లేదని తెలుస్తోంది. కాకపోతే డిజిటల్ కంటెంట్ తో వెబ్ సిరీస్ ల నిర్మాణం చేయడానికి మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కానీ అది కూడా ఇప్పట్లో కుదిరే ఛాన్సెస్ కూడా లేవంట. ఇప్పటికే ఏఏమ్‌ బీ మల్టీప్లెక్స్‌ ద్వారా మల్టీప్లెక్స్‌ రంగంలో.. హంబుల్‌ ద్వారా టైక్స్‌టైల్‌ రంగాల్లో అడుగుపెట్టిన మహేష్.. మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఎంబీ ప్రొడక్షన్స్ పేరుతో మహేష్ బాబు సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా వ్యవహరిస్తూ హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. తన కెరీర్ లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ - కియారా అద్వానీ - సారా అలీఖాన్ లలో ఎవరో ఒకరు నటించే అవకాశాలున్నాయట. ఈ చిత్ర షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' అనే బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులను బట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.