Begin typing your search above and press return to search.
నేను పర్ఫెక్షనిస్ట్ కాదు-మహేష్ బాబు
By: Tupaki Desk | 15 May 2016 5:30 PM GMTబాలీవుడ్లో అమీర్ ఖాన్ కు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరుంది. తననలా పిలిస్తే అమీర్ ఏమీ అభ్యంతరపెట్టడు. సంతోషిస్తాడు కూడా. కానీ టాలీవుడ్లో కూడా మహేష్ బాబుకు కూడా అలాంటి పేరే ఉంది. ఏ సన్నివేశాన్నీ ఓ పట్టాన ఒప్పుకోడని.. మరింతగా బాగా చేద్దామని రీటేకులు తీసుకుంటాడని అంటుంటారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సైతం మహేష్ గురించి ఓ ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. ఐతే ఈ విషయం మహేష్ దగ్గర ప్రస్తావిస్తే నవ్వేశాడు. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని.. తనను అలా పిలవద్దని అన్నాడు. తానేదో గొప్పగా నటించేయాలని.. మంచి పేరు సంపాదించాలని రీటేక్స్ తీసుకోనని.. కేవలం సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకునే అలా ప్రయత్నిస్తానని అన్నాడు.
‘‘దర్శకుడు మనకో సన్నివేశం చెబుతాడు. దాన్ని మనం ఒకలా ఊహించుకుంటాం. మనం అనుకున్న ఫీల్ సన్నివేశంలో వస్తోందా లేదా అన్నదే ఆలోచిస్తా. దర్శకుడు కోరుకున్నది ఇస్తున్నామా లేదా అనే చూస్తా. సంతృప్తి లేకుంటే ఎన్ని టేకులైనా తీసుకుంటా. నిజానికి నేను దేనికీ శాటిస్ఫై అవ్వను. ఐతే ఉన్నంతలో మెరుగ్గా చేయడానికి.. దర్శకుడు కోరుకున్న ఎమోషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటా. ఐతే తర్వాత చేసిన టేకుల కన్నా ముందుదే బావుందనిపిస్తే దాన్నే ఓకే చేసేస్తుంటా. అంతే తప్ప నాకేదో మంచి పేరు రావాలని.. పర్ఫెక్షనిస్ట్ అనిపించుకోవాలని ఏమీ ఉండదు. నేను అలాంటి ముద్రను కోరుకోను’’ అని సెలవిచ్చాడు మహేష్.