Begin typing your search above and press return to search.

సూటు బూటు అంటే ఏదోలా ఉంటుంది-మహేష్

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:35 AM GMT
సూటు బూటు అంటే ఏదోలా ఉంటుంది-మహేష్
X
మహేష్ బాబు టాలీవుడ్ వరకే కాదు.. మొత్తం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత అందమైన హీరోల్లో ఒకడు. తెరమీద మహేష్ ఎంత అందంగా కనిపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసు పెరిగేకొద్దీ హీరోల అందం తగ్గిపోతుంటుంది కానీ.. మహేష్ మాత్రం రివర్స్ లో రాను రాను అందం పెంచుకుంటున్నాడు. మహేష్ తాజా సినిమా ‘శ్రీమంతుడు’ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మరి ఈ గ్లామర్ రహస్యమేంటి అని మహేష్ ను అడిగితే.. ‘‘అందులో అసలు రహస్యమంటూ ఏమీ లేదు. ఓ మంచి కథ మనదగ్గరికి వచ్చినపుడు.. డైరెక్టర్ క్లారిటీతో ఉన్నపుడు.. సినిమా బాగా వస్తున్నపుడు.. నిర్మాత సంతోషంగా ఉన్నపుడు నేను ఆ సినిమాలో తప్పకుండా అందంగా కనిపిస్తా’’ అని సమాధానమిచ్చాడు.

తెరమీద అంత స్టైలిష్ గా కనిపించే మీరు బయట అంత సింపుల్ గా ఉంటారెందుకు అని అడిగితే.. ‘‘తెరపై కనిపించినట్లుగా బయట కనిపించడం నావల్ల కాదు. ఒక గంట పాటు సూటు బూటూ వేసుకుంటే ఏదోలా అనిపిస్తుంటుంది. సౌకర్యవంతంగా అనిపించే దుస్తులు వేసుకోవడమే నాకిష్టం. వాటికి మించిన గొప్ప ఫ్యాషన్ మరొకటి ఉండదని నమ్ముతా. తెరపై కథ, పాత్రల రీత్యా కొత్త కొత్త స్టయిల్స్ లో కనిపించడం అవసరం. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్లు ఏ దుస్తులిస్తే అవి వేసుకుంటా. కానీ బయట, ఇంట్లో మాత్రం నాకు నచ్చినట్లు వేసుకుంటా. అది ఎలాంటి కార్యక్రమమైనా సరే.. నాకు నచ్చినట్లు దుస్తులు వేసుకుంటా. సినిమాల్లో లాగా హెవీగా, ప్రత్యేకంగా దుస్తులు ధరించడం నాకిష్టముండదు’’ అని మహేష్ చెప్పాడు.