Begin typing your search above and press return to search.

మహేష్.. కొరటాల.. ముందే ఎలర్ట్

By:  Tupaki Desk   |   10 Nov 2017 11:49 PM IST
మహేష్.. కొరటాల.. ముందే ఎలర్ట్
X
మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ భరత్ అను నేను. ఈ మూవీతో సక్సెస్ కొట్టి.. మళ్లీ స్టామినా చూపించాలని భావిస్తున్నాడు మహేష్. ఇప్పటికే బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాలు సూపర్ స్టార్ ఇమేజ్ ను దెబ్బ కొట్టాయి.

ఇప్పటివరకూ చేసిన సినిమాలకు భిన్నంగా.. కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యం ఉన్న కథతో రాబోతున్నాడు మహేష్. ఫ్యామిలీ.. క్రైమ్ థ్రిల్లర్ కథలతో అపజయాలను అందుకున్న మహేష్.. పాలిటిక్స్ యాంగిల్ తో ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే కొరటాల కూడా సినిమాను చాలా కొత్తగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నాడట. మహేష్ కూడా తనకు సంబందించిన సీన్ కాకపోయినా ఇతర సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ని దగ్గరుండి మరీ చూస్తున్నాడట.

ఇక సినిమాను కొరటాల 140 నిమిషాలు మాత్రమే ఉండేట్లు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి.. క్రిస్ప్ గా ఉండేలా.. ప్రతి సన్నివేశం క్లియర్ గా ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా కొరటాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాకుండా మహేష్ రెండు సినిమాలు వరుసగా నిరాశపరచడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకునేలా కొరటాల కష్టపడుతున్నాడు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.