Begin typing your search above and press return to search.

లెక్కలు మా ఆవిడే చూస్తుంది -మహేష్‌

By:  Tupaki Desk   |   29 Nov 2015 6:16 AM GMT
లెక్కలు మా ఆవిడే చూస్తుంది -మహేష్‌
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ బాబు త‌న వ్య‌క్తి గ‌త జీవితం గురించి, దాంప‌త్య జీవ‌నం గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాల్ని రివీల్ చేశారు. తెలిస‌న‌వే అయినా వింటుంటే చెవిలో అమృతం ఒలికించిన‌ట్టే ఉంటాయి ఇలాంటివి. ఎస్‌.. ప్రిన్స్ మ‌హేష్ త‌న ల‌వ్ లైఫ్ గురించి మ‌రోమారు గుర్తు చేసుకున్నారు. స‌రిగ్గా 2005లో న‌మ్ర‌త‌ను పెళ్లాడాను. అయితే అంత‌కంటే ముందే నాలుగేళ్ల పాటు మేం డేటింగ్ చేశాం. ఇప్ప‌టికి కాపురం మొద‌లు పెట్టి 14 ఏళ్లు విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయి. .. అంటూ మ‌ధురానుభూతుల్ని గుర్తు చేసుకున్నారు ప్రిన్స్‌.

అంతేనా అంత‌కుమించి త‌న వీక్ నెస్‌ ని గుర్తు చేస్తూ .. అస‌లు ఆర్థిక వ్య‌వ‌హారాల్లో నేను చాలా వీక్‌. లెక్క‌లు వేసుకోవ‌డం అస్స‌లు తెలీదు. కానీ వాట‌న్నిటినీ చూసుకోవడంలో న‌మ్ర‌త ది బెస్ట్‌. నాకు లెక్క‌లు రావు. కానీ త‌ను అందులో పెర్ ఫెక్ట్‌. ప్ర‌తి రూపాయి ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి? ఎలా పెంచి పెద్దది చేయాలి? అన్న‌ది త‌నే చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

నిజ‌మే న‌మ్ర‌త లెక్క‌ల మ్యాడ‌మ్ కాబ‌ట్టి హైద‌రాబాద్‌ లో అదిరిపోయే ఇల్లు క‌ట్టించింది. ఆ ఇంటికి సంబంధించిన ఖ‌ర్చులు - లెక్క‌లు - ఆర్కిటెక్ట్ - ఇంటీరియ‌ర్ అన్నీ త‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంది. ఇప్పుడు ముంబైలో ఇల్లు కొనిపించింది. ఆ ఇల్లు తాలూకా ప‌నులు, లెక్క‌లూ అన్నీ త‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం. అన్యోన్య దాంప‌త్యం ఉంటేనే ఎదుగుద‌ల సాధ్యం అని చెప్ప‌డానికి ఈ క‌పుల్ గురించి తెలుసుకుంటే స‌రి !!