Begin typing your search above and press return to search.

నేనొక్కడినే.. ఏం చేస్తాం నవ్వడం తప్ప!

By:  Tupaki Desk   |   2 Aug 2015 4:16 PM GMT
నేనొక్కడినే.. ఏం చేస్తాం నవ్వడం తప్ప!
X
కొన్ని సినిమాలంతే.. ఆ సమయానికి బాలేవనిపిస్తాయి. కానీ కొన్నాళ్ల తర్వాత అద్భుతంగా అనిపిస్తాయి. ఆ కేటగిరిలీ చేర్చదగ్గ సినిమా ‘1 నేనొక్కడినే’. ఐఎండీబీ మన సినిమా గొప్పదనాన్ని గుర్తించి హాలీవుడ్ థ్రిల్లర్స్ కంటే దీన్నే ఓ మెట్టు పైనే ఉంచాక కానీ.. ఆ సినిమా గొప్పదనం మనకు తెలిసి రాలేదు. మొదటిసారి సినిమా చూసి బాలేదన్నవాళ్లు కూడా ఆ తర్వాత సినిమా గొప్పదనాన్ని తెలుసుకున్నారు. టీవీలో వేసినపుడు సినిమాకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

ఇదే సంగతి మహేష్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ప్రేక్షకులకు కొత్తగా ఏమైనా ఇద్దామా అని చూశాం. పాత్ బ్రేకింగ్ మూవీ అయిన 1 నేనొక్కడినే లాంటి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడం నన్ను బాగా నిరుత్సాహపరిచింది. అలాంటి ప్రయోగాత్మక సినిమాలను స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పాలి. కానీ ఆ విషయంలో మేం ఫెయిలయ్యాం అనుకుంటున్నాం. ఐతే అదే సినిమాను టీవీల్లో చూసి జనం అద్భుతం అంటున్న సంగతి నేనూ విన్నా. ఇలా అన్నపుడు ఏం చేస్తాం.. ఓ చిన్న నవ్వు నవ్వడం తప్ప’’ అని సమాధానమిచ్చాడు మహేష్.

తన కెరీర్లో ప్రయోగాలు చేసిన ప్రతిసారీ దెబ్బతిన్నానని.. టక్కరిదొంగ, నాని, 1 నేనొక్కడినే సినిమాలు తనను బాగా డిజప్పాయింట్ చేశాయని.. అంత మాత్రాన ప్రయోగాలే చేయొద్దని తాను భావించడం లేదని మహేష్ చెప్పాడు. ఎవరైనా మంచి స్క్రిప్టు తో వస్తే మళ్లీ ప్రయోగం చేయడానికి సిద్ధమని.. ఐతే గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని మహేష్ చెప్పాడు. తన ఫెయిల్యూర్స్ కి దర్శకుల్ని తప్పుబట్టడం ఎంతమాత్రం సబబు కాదని.. కథ ఓకే చేసి సినిమా చేశాను కాబట్టి తనకూ బాధ్యత ఉంటుందని మహేష్ అన్నాడు.