Begin typing your search above and press return to search.

మ‌హేష్ కీ ఆ ఆలోచన ఉందా?

By:  Tupaki Desk   |   28 March 2016 4:01 AM GMT
మ‌హేష్ కీ ఆ ఆలోచన ఉందా?
X
ఒక మంచి సినిమా వ‌చ్చిందని తెలిస్తే చాలు. త‌ప్ప‌కుండా చూస్తాడు మ‌హేష్‌. చూడ‌ట‌మే కాదు.. ఆ చిత్ర‌బృందాన్ని కూడా అభినందిస్తుంటాడు. ఊపిరి చూశాక కూడా మ‌హేష్ వెంట‌నే స్పందించాడు. ట్వీట్ చేసి చిత్ర‌బృందాన్ని అభినందించాడు. అంత‌టితో ఆగకుండా నాగార్జున‌కి ఫోన్ చేసి అర‌గంట సేపు మాట్లాడ‌ట‌. ఆ విష‌యాన్ని నాగార్జున ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఇక నుంచి మేమేం చూపించాలి అన్నాడంటూ మ‌హేష్ చెప్పిన మాటల్ని కూడా నిన్న జ‌రిగిన స‌క్సెస్‌ మీట్‌ లో బ‌య‌ట‌పెట్టాడు నాగ్‌. అయితే మహేష్ అన్న ఆ మాట‌లే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌హేష్ కూడా నాగ్‌ లాగే ఇమేజ్‌ ని వ‌దిలిపెట్టి సినిమాలు చేయాల‌నుకుంటున్నాడేమో అన్న సంకేతం ఆ మాట‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

అస‌లు మ‌హేష్ ఇమేజ్ వేరు, నాగ్ ఇమేజ్ వేరు. నాగార్జున మొద‌ట్నుంచీ వైవిధ్య‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నాడు. అందుకే ఆయ‌న‌కి విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా పేరుంది. మ‌హేష్ మాత్రం మొద‌ట్నుంచీ మాస్ మంత్ర‌మే జ‌పిస్తున్నాడు. కానీ రెండు మూడేళ్లుగా మ‌హేష్ ఆలోచ‌న‌ల్లోనూ మార్పొచ్చిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు - శ్రీమంతుడులాంటి సినిమాల్లో మ‌హేష్ త‌ర‌హా మాస్ అంశాలేమీ ఉండ‌వు. కానీ మ‌హేష్ మాత్రం ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి ఆయా సినిమాలు చేశాడు. విజ‌యాల్ని అందుకొన్నాడు. ఇప్పుడు మ‌రో మెట్టు కూడా దిగి మ‌రిన్ని కొత్త ప్ర‌యోగాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో మ‌హేష్ ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే నాగ్ వీల్ ఛెయిర్‌ లో కూర్చున్న పాత్ర‌ని చూసి `అన్నీ నువ్వే చేసేస్తే ఇక మేమేం చూపించాలి` అన్నాడ‌నేది అర్థ‌మ‌వుతోంది. అంటే మ‌హేష్ మ‌న‌సులో కూడా అలాంటి పాత్ర‌లొస్తే అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌ద‌న్న అభిప్రాయం ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది.