Begin typing your search above and press return to search.
సోమవారం నుండి మహేష్ ఏం చేస్తాడో
By: Tupaki Desk | 24 Sep 2017 5:49 PM GMTప్రతి హీరో తన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి భారీ స్థాయిలో ఒక్క సినిమా అయినా తీయాలని అనుకుంటాడు. అలాంటి సినిమా తెరకెక్కించాలంటే అందుకు కావాల్సిన కథ మరియు స్క్రిప్ట్ తప్పకుండా ఉండాలి. మినిమమ్ వందేళ్లయినా ఆ సినిమా అలా ప్రతి ఒక్కరి మనస్సులో ఉండిపోవాలి అని అనుకుంటాడు. ఆ అదృష్టం చాలా మందికి దక్కదు. ఒకవేళ వచ్చినా అందరూ అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేరు. ఇప్పుడు మహేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించిన మహేష్ ఇప్పుడు మొదటి సారి స్పై ధ్రిల్లర్ తరహా కథతో రాబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వంలో తెలుగు - తమిళ్ లో తెరకెక్కిన ఆ సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. మొదటి సారి మహేష్ తన సినిమాను తమిళ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలా అయినా మహేష్ సౌత్ లో మంచి మార్కెట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకు మహేష్ ప్రమోషన్స్ ని కూడా కాస్త ఎక్కువగానే నిర్వహించడానికి రెడీ అయ్యాడట. తమిళ్ లో ఇప్పటికే మీడియా ప్రమోషన్స్ ని నిర్వహించిన ప్రిన్స్. సోమవారం నుంచి గ్యాప్ లేకుండా తెలుగు లో కూడా మీడియా ద్వారా ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించడానికి రెడీ అయ్యాడట.
ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ - జై లవకుశ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రస్తుతం తారక్ హవా బాగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేందుకు మహేష్ సోమవారం నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వనున్నాడు. బుధవారం రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జై లవకుశ అంచనాలకు తగ్గట్టు పాజిటివ్ టాక్ తో ముందుకి వెళుతోంది. అయితే స్పైడర్ కూడా ఊహించని స్థాయిలో ఊహలను అందుకుంటేనే సక్సెస్ అవుతుంది. మరి మహేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.