Begin typing your search above and press return to search.
మరీ ఇంత మొక్కుబడిగానా మహేషూ
By: Tupaki Desk | 30 July 2015 6:00 PM GMTతమిళ హీరోలు మన మార్కెట్ కొల్లగొట్టేస్తుంటే మన హీరోలకు కాస్తో కూస్తో బాధ ఉండటం సహజం. ఐతే వాళ్ల సినిమాలకు మన దగ్గర వసూళ్లు రావడం గురించి బాధపడటం తప్పితే.. మనం వెళ్లి వాళ్ల మార్కెట్లో సత్తా చాటుకుందాం అనే ప్రయత్నం ఇన్నాళ్లూ మన హీరోలు పెద్దగా చేయలేదు. కానీ ఈ మధ్యే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. బాహుబలి ప్రభంజనం చూశాక మంచి సినిమాతో వెళ్తే అరవ ఆడియన్స్ కూడా మనల్ని బాగానే ఆదరిస్తారన్న నమ్మకం కుదిరింది. మహేష్ ‘శ్రీమంతుడు’తో తమిళనాట సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. తనే స్వయంగా తమిళ వెర్షన్ కు డబ్బింగ్ కూడా చెప్పాడంటే తమిళ మార్కెట్ మీద బాగానే శ్రద్ధ పెట్టాడని అర్థం చేసుకోవచ్చు.
శ్రీమంతుడు తమిళ వెర్షన్ ‘సెల్వందన్’ ఆడియోను కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు మహేష్. స్టార్ హీరో విజయ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి చెన్నైలో ఆడియోను హంగామాతో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. శుక్రవారం ఆడియో ఫంక్షన్ జరగాల్సింది. కానీ ఎందుకో తెలియదు.. ఫంక్షన్ వాయిదా పడిపోయింది. ఆగస్టు 4న ఆ కార్యక్రమం పెట్టుకుంటారంట. కానీ మరీ విడుదలకు మూడు రోజులుండగా ఆడియో విడుదల చేయడమేంటో అర్థం కావడం లేదు. ఇది మొక్కుబడి వ్యవహారం అన్న ఫీలింగ్ తమిళ ఆడియన్స్ కు తప్పక కలుగుతుంది. ఇంతకుముందు ‘లింగ’ సినిమా తెలుగు ఆడియో విషయంలో రజినీకాంత్ కూడా ఇలాగే చేశాడు. విడుదలకు నాలుగు రోజుల ముందు ఇక్కడ ఫంక్షన్ పెట్టాడు. ఇప్పుడు మహేష్ కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఆడియో బాగుంది, పైగా దేవిశ్రీ సంగీతమందించాడు కాబట్టి ఫంక్షన్ కొంచెం ముందే జరిపి ఉంటే బాగుండేది.