Begin typing your search above and press return to search.
వారం బ్రేక్ ఇస్తున్న సూపర్ స్టార్
By: Tupaki Desk | 17 Aug 2016 3:00 PM ISTఅసలు బ్రేక్ అంటే ఈ రేంజులో ఉంటుందా అంటూ జనాలు ఆశ్చర్యపోయే పొజిషన్ నుండి.. బ్రేక్ అనేదే లేకుండా పనిచేస్తే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేశాడు మహేష్ బాబు. ఒకప్పుడు సినిమా సినిమాకూ చాలా నెలల బ్రేక్ తీసుకునే ఈ సూపర్ స్టార్ ఇప్పుడు కనీసం షెడ్యూల్ టు షెడ్యూల్ కూడా పెద్దగా గ్యాప్ ఉంచట్లేదు.
జూలై 29న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది మహేష్ కొత్త సినిమా. ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ కొత్త సినిమా షూటింగ్ లో మహేష్ ఒక రెండు రోజుల లేటుగా పాల్గొన్నాడు. అప్పటినుండి షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ముందు ఒక సాంగ్ షూట్ చేసి.. తరువాత హైదరాబాద్ లో కొన్ని యాక్షన్ సీన్లను తీశారు. దాదాపు ప్రతీ రోజూ నైట్ ఎఫెక్టులోనే ఈ సీన్లన్నీ తీయడం విశేషం. అయితే ఈ షెడ్యూల్ పూర్తయ్యిందట. తదుపరి మనోడు ముంబయ్ - చెన్నయ్ - పూణె లలో షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఒక వారం గ్యాపిచ్చి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ఫిక్సయ్యారు.
ఈ మధ్య కాలంలో బ్రేక్ అంటే చాలు.. దుబాయ్ - లండన్ - ప్యారిస్ తదితర ఊళ్ళలో రెస్టు తీసుకుంటున్న మహేష్.. ఇప్పుడు కేవలం వారం రోజుల కోసం అలా ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాడా లేకపోతే హైదరాబాద్ లో ఉండి దర్శకులు చెప్పే కొత్త కథలను వింటాడా? చూద్దాం మరి.