Begin typing your search above and press return to search.
వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు
By: Tupaki Desk | 12 Aug 2015 10:07 AM GMTతన బాక్సాఫీస్ స్టామినా ఏంటో కెరీర్ ఆరంభంలో ‘ఒక్కడు’తోనే రుజువు చేశాడు మహేష్. అప్పట్లో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసిందా సినిమా. ఆ తర్వాత పోకిరి సరికొత్త రికార్డులకు నాంది పలికింది. ఇప్పుడు ‘శ్రీమంతుడు’తో ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే పనిలో పడ్డాడు ప్రిన్స్. ఈ సినిమా ఐదో రోజుకే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయి రికార్డు సంచలనం సృష్టించింది. మహేష్ ఇంతకుముందు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతోనూ యాభై కోట్ల మార్కును అందుకున్నాడు. టాలీవుడ్ లో మరే హీరోకు కూడా ఈ ఘనత దక్కలేదు. పవన్ కళ్యాణ్ రెండుసార్లు (గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది), అల్లు అర్జున్ రెండుసార్లు (రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి) 50 కోట్ల మార్కును అందుకున్నారు. డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఈ ఘనత సాధించాడు.
సౌత్ ఇండియాలో మహేష్ కాకుండా మూడుసార్లు 50 కోట్ల మార్కును అందుకున్న హీరో ఒక్క రజినీకాంత్ మాత్రమే. ఆయన శివాజీ, రోబో, లింగా సినిమాలతో వరుసగా 50 కోట్ల మార్కును దాటాడు. ఆ తర్వాత మహేష్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మహేష్ సినిమాల్లో ఇప్పటిదాకా ‘దూకుడు’దే రికార్డు. ఆ సినిమా రూ.58 కోట్ల దాకా వసూలు చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ రికార్డును దాటేయడం ఖాయం. రెండో వీకెండ్ అయ్యేసరికి ‘శ్రీమంతుడు’ రూ.80 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో వంద కోట్ల మార్కును సునాయాసంగా అందుకుంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తొలి రోజు, తొలి వీకెండ్ వరకు నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ ‘శ్రీమంతుడు’ బద్దలుకొట్టేశాడు.