Begin typing your search above and press return to search.
ఇంకో జీవితం ఉంటే నువ్వే నాకు అన్నయ్య! మహేష్ ఎమోషనల్ నోట్!!
By: Tupaki Desk | 9 Jan 2022 12:13 PM GMTసూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణం ప్రతి సినీ ప్రియుడి గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. ఆయన మరణవార్త విని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. బజార్ రౌడీ నటుడి మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
ఘట్టమనేని రమేష్ బాబు తమ్ముడు మహేష్ నేటి అంత్యక్రియలకు అందుబాటులో లేని సన్నివేశం నెలకొంది. అయితే ఆయన కొద్ది సేపటి క్రితం గుండెల్ని టచ్ చేసే ఎమోషనల్ నోట్ తో అన్నయ్యకు కడసారి వీడ్కోలు పలికారు.
రెండ్రోజుల క్రితం మహేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. అందువల్ల అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. రమేష్ బాబు చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేక కాలేయ సంబంధిత సమస్యలతో మృతి చెందాడు. చెన్నైలో జన్మించిన రమేష్ బాబు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసినదే.
ట్విటర్ లో మహేష్ 90ల నాటి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ నోట రాసారు. నువ్వే నాకు ప్రేరణ.. నీవే నా బలం.. నువ్వు నా ధైర్యం.. నీవే నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న దాంట్లో సగం అయినా ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు కేవలం విశ్రాంతి...విశ్రాంతి...అతని జీవితంలో నాకు మరొకటి ఉంటే మీరు ఎల్లప్పుడూ నా `అన్నయ్యగా ఉంటారు. ఎప్పటికీ .. ఎప్పటికీ .. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను`` అని నోట్ లో ఎమోషనల్ అయ్యారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రమేశ్ బాబు భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచారు. అక్కడ ఇండస్ట్రీ జనం అంతిమ నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. కోవిడ్ ఉప్పెనను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు తమ శ్రేయోభిలాషులు భద్రతా ప్రోటోకాల్ లను పాటించాలని దహన సంస్కారాల స్థలంలో గుమిగూడకుండా ఉండాలని అభ్యర్థించారు.