Begin typing your search above and press return to search.
మహర్షి అలెర్ట్ అయ్యాడు
By: Tupaki Desk | 10 April 2019 4:25 PM GMTఅభిమానులు ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఎంత గర్వంగా చెప్పుకున్నా మహర్షి టీజర్ లో రొటీన్ కమర్షియల్ అంశాలు ఎక్కువ హై లైట్ అయిన మాట వాస్తవం. మహేష్ లాంటి స్టేచర్ ఉన్న హీరో మూవీలో ఇవన్నీ సహజమని సర్దిచెప్పుకున్నా కనీసం పాత హిట్ సినిమాల ఛాయలు లేకుండా జాగ్రత్త పడాల్సింది. నిమిషం న్నర టీజర్ లోనే శ్రీమంతుడు భరత్ అనే నేను బిజినెస్ మ్యాన్ ఇలా మూడేసి రెఫరెన్సులు గుర్తుకురావడం అంటే చిన్న విషయం కాదుగా.
అందుకే సోషల్ మీడియాలో దీని గురించి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఉగాది పండగ రోజు వదలాలన్న ఆత్రంలో ఏవో కొన్ని షాట్స్ తీసుకుని మిక్స్ చేసి ఇచ్చారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆన్ లైన్ ట్రెండ్స్ గురించి చాలా యాక్టివ్ గా ఉండే మహేష్ పిఆర్ టీమ్ దృష్టికి ఇవన్నీ రాకుండా పోలేదు. వాటిని బేస్ చేసుకుని మహేష్ కు కూలంకుశంగా మహర్షి టీజర్ రెస్పాన్స్ కు సంబందించిన రిపోర్ట్ ఇచ్చారట.
ఇప్పుడు ట్రైలర్ విషయంలో అలాంటి కామెంట్స్ కి అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలని కంటెంట్ ఉన్నప్పుడు కథ లీకవుతుందన్న భయమెందుకని వంశీ పైడిపల్లితో అన్నట్టు ఇన్ సైడ్ టాక్. హిందీ సినిమాలు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసినా తమ కథను అరటిపండు వలిచినట్టు ట్రైలర్ లో చూపిస్తారని మరీ అలా కాకపోయినా మహర్షి రెగ్యులర్ మూవీ అనే ఫీలింగ్ కలగకుండా అందులో ఫీల్ కనెక్ట్ అయ్యేలా కట్ చేయమని సలహా ఇచ్చాడట. ఇప్పుడు వంశీ పైడిపల్లి టీమ్ అదే పని మీదున్నట్టు సమాచారం. డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఈ నెలాఖరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అందులోనే ట్రైలర్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మే 9 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదు.