Begin typing your search above and press return to search.
‘గరుడవేగ’ను ఆకాశానికెత్తేసిన మహేష్
By: Tupaki Desk | 11 Nov 2017 10:28 AM GMT‘గరుడవేగ’ సినిమా చూసి మహేష్ బాబు తమను అభినందించినట్లుగా ఈ సినిమా సక్సెస్ మీట్లో జీవిత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే అప్పుడు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపిన మహేష్.. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా బహిరంగంగానే ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ పెట్టాడు మహేష్.
గ్రేట్ స్క్రిప్ట్.. గుడ్ పెర్ఫామెన్సెస్.. స్లిక్ స్క్రీన్ ప్లే అంటూ మొదలుపెట్టి.. సినిమా స్టన్నింగ్ గా ఉందని.. ఈ చిత్ర బృందమంతా చాలా బాగా చేసిందని.. ‘టేక్ ఎ బౌ రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు’ అంటూ ట్వీట్ ముగించాడు మహేష్ బాబు. వెంటనే రాజశేఖర్ స్పందిస్తూ మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పాడు. తమ కోసం ఇంత సమయం కేటాయించినందుకు.. తమను అభినందించినందుకు కృతజ్నతలు చెప్పాడు రాజశేఖర్. మహేష్ ఇలా ట్వీట్ చేశాడో లేదో అది వైరల్ అయిపోయింది.
ఐతే మహేష్ బాబు ఈ ట్వీట్ పెట్టడంలో ఆలస్యం చేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్లోనే మహేష్ ఈ ట్వీట్ పెట్టి ఉంటే అది ప్రచారానికి బాగా ఉపయోగపడేది. ఈ సినిమా వసూళ్లు ఇప్పుడు అంత ఆశాజనకంగా లేవు. ఈ వారం నాలుగు సినిమాలు రిలీజవ్వడం దీనిపై ప్రభావం చూపింది. మరోవైపు ‘గరుడవేగ’ సినిమాను గత ఆదివారమే చూడబోతున్నట్లు చెప్పిన రాజమౌళి మాత్రం ఇంకా దీని గురించి స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.