Begin typing your search above and press return to search.

ఆ ట్రైల‌ర్ చూసి మ‌హేష్ ఫిదా అయిపోయాడు

By:  Tupaki Desk   |   14 Dec 2016 3:30 PM GMT
ఆ ట్రైల‌ర్ చూసి మ‌హేష్ ఫిదా అయిపోయాడు
X
‘ఓకే బంగారం’ సినిమాకు లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ త‌న స్థాయికి త‌గ్గ‌ట్లే అద్భుత‌మైన ఛాయాగ్ర‌హ‌ణం అందించాడు. ఐతే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న మ‌ణిర‌త్నం శిష్యుడు షాద్ అలీ మాత్రం.. పి.సిని కాద‌ని ర‌వి.కె.చంద్ర‌న్ ను ఛాయాగ్రాహ‌కుడిగా పెట్టుకోవ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. పి.సి. కంటే గొప్ప‌గా ర‌వి ఏం చేసేస్తాడు అని సెటైర్లు వేశారు. ఐతే ఇప్పుడు ‘ఓకే జాను’ ట్రైల‌ర్ చూశాక మాత్రం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు జ‌నాలు. ‘ఓకే బంగారం’ చూసిన వాళ్ల‌కు కూడా క‌ళ్లు చెదిరిపోయేలా హిందీ వెర్ష‌న్ ను క‌ల‌ర్ ఫుల్ విజువ‌ల్స్ తో నింపేశాడు ర‌వి.కె.చంద్ర‌న్.

మొన్న ‘ఓకే జాను’ ట్రైల‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచి దీని గురించి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. చివ‌రికి మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ఈ ట్రైల‌ర్ చూసి ఫిదా అయిపోయాడు. విజువ‌ల్స్ అద్భుతం అంటూ పొగిడేశాడు. ఐతే మ‌హేష్ ఈ ట్రైల‌ర్ని పొగ‌డ్డం వెనుక ఇంకో కార‌ణం కూడా ఉందిలెండి. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ర‌వి.కె.చంద్ర‌నే మ‌హేష్ త‌ర్వాతి సినిమాకు ప‌ని చేస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ చేయ‌బోయే సినిమాకు ర‌వినే ఛాయాగ్రాహ‌కుడు. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే గొప్ప సినిమాటోగ్రాఫ‌ర్ల‌లో ఒక‌డైన ర‌వి.. మ‌న మ‌హేష్ ను ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా మ‌హేష్ కు తాను అభిమాన‌ని కూడా ర‌వి చెప్పాడు. అందులోనూ ‘ఓకే జాను’ ట్రైల‌ర్ చూశాక ర‌వి మీద అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/