Begin typing your search above and press return to search.
మహేష్ కి కుర్రాడి దూకుడు నచ్చింది
By: Tupaki Desk | 26 Nov 2015 5:30 PM GMTచిత్రసీమకి రాచమార్గాన్నికనిపెట్టాయి షార్ట్ ఫిలింలు. ఒక మంచి ఐడియాతో షార్ట్ ఫిలింని తీసేసి దాన్ని యూ ట్యూబ్‌లో పెడితే చాలు. అదే అవకాశాన్ని తెచ్చిపెడుతోంది. అలా యూ ట్యూబ్ ద్వారా అవకాశాల్ని సంపాదించిన దర్శకులు, నటీనటులకి మన తెలుగు చిత్రసీమలో లెక్కే లేదు. చెప్పాలంటే ఇటీవలికాలంలో వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు అన్నట్టుగా... వాళ్లు తీసిన షార్ట్ ఫిలింలని చూసి వాళ్ల ప్రతిభని అంచనా వేస్తున్నారు నిర్మాతలు. కాస్త నమ్మకం కలిగినా వాళ్లకి అవకాశాల్ని కట్టబెడుతున్నారు. అలా షార్ట్ ఫిలింతో సినిమా తీసే అవకాశాన్ని సొంతం చేసుకొన్న ఓ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. మహేష్ బావ సుధీర్‌బాబుతో `భలే మంచి రోజు` సినిమాని తీశాడు. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ బయటికొచ్చాక మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అంతా శ్రీరామ్ ఆదిత్య గురించి ఆరా తీస్తున్నారు. అతనెలా ఉంటాడో, అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో బయటపడింది. ఆ కుర్రాడి దూకుడు మహేష్ బాబుని కూడా ఆకట్టుకుంది.
భలే మంచి రోజు ఆడియో ఫంక్షన్ కి మహేష్ స్పీచ్ ఎంత హైలెట్ అయ్యిందో.. శ్రీరామ్ ఆదిత్య స్పీచ్ కూడా అంతే హైలెట్ అయ్యింది. మహేష్ తన బావ స్టార్ అవుతాడని చెప్పి అందరినీ అలరించాడు. అలాగే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫుల్ జోష్ తో తన సినిమా గురించి కాన్ఫిడెన్స్ గా చెప్పడం, అతని మాట్లాడిన తీరు కూడా విభిన్నంగా ఉండటం అందరినీ ఆకట్టుకుంది. ఆ విషయం మహేష్ దృష్టిలో కూడా పడింది. అందుకే తన స్పీచ్ లో శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చాడు. కుర్రాడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని చెప్పాడు. అతని కాన్ఫిడెన్స్ ఎంతగా నచ్చుంటే తన బావ ఈ సినిమాతోనే స్టార్ కావొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసుంటాడు మహేష్! మొత్తమ్మీద చూస్తుంటే శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకొనేలా కనిపిస్తున్నాడు.