Begin typing your search above and press return to search.

మ‌హేష్‌ కి వ‌చ్చిన లాభం 80 కోట్లు?!

By:  Tupaki Desk   |   25 Sep 2015 4:32 AM GMT
మ‌హేష్‌ కి వ‌చ్చిన లాభం 80 కోట్లు?!
X
బాహుబ‌లి లాంటి సెన్సేష‌న్ త‌ర్వాత వ‌చ్చిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా శ్రీమంతుడు. బాహుబ‌లి క‌లెక్ష‌న్ల ప్ర‌భావం శ్రీమంతుడుపై స్ప‌ష్టంగా క‌నిపించింది. `బాహుబ‌లి`తో థియేట‌ర్ ఎక్స్‌ పీరియ‌న్స్‌ కి బాగా అల‌వాటుప‌డ్డ ప్రేక్ష‌కులు వెంట‌నే వ‌చ్చిన శ్రీమంతుడుని కూడా చూసేశారు. దీంతో అటు డొమెస్టిక్‌ గా, అటు ఓవ‌ర్సీస్‌ లోనూ సినిమాకి భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. అయితే గ‌త సినిమాలు మిగిల్చిన అనుభ‌వాల‌తో శ్రీమంతుడు సినిమాని మ‌హేష్ చాలా త‌క్కువ పెట్టుబ‌డితో పూర్తి చేయించాడు. 1 - దూకుడు సినిమాల్లో ఒకొక్క‌దానికి 70కోట్ల‌కు పైగా ఖ‌ర్చ‌వ‌డం, బాక్సాఫీసు ద‌గ్గ‌ర అవి స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంలాంటి ప‌రిస్థితులు మూలాన నిర్మాత‌ల‌కి భారీగా న‌ష్టాలొచ్చాయి. అందుకే మ‌హేష్ ఆ త‌ప్పు జ‌ర‌గకుండా ఆయ‌నే ఓ నిర్మాత‌గా మారి మైత్రీ మూవీస్‌ తో క‌లిసి `శ్రీమంతుడు` సినిమాని నిర్మించాడు. కేవ‌లం 40కోట్ల‌తో ఆ సినిమా పూర్త‌యింద‌ట‌. కానీ బాక్సాఫీసు ద‌గ్గ‌రికొచ్చేస‌రికి 170కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన‌ట్టు అంచ‌నా. ఆ లెక్క‌న ఒక్క మ‌హేష్‌ బాబుకే 80కోట్ల మేర లాభాలొచ్చిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి.

ఇటీవ‌ల‌ కాలంలో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా రెండు మూడు వారాల‌కంటే ఎక్కువ ఆడ‌దు. కానీ మ‌హేష్ న‌టించిన శ్రీమంతుడు సినిమా మాత్రం 185 సెంట‌ర్ల‌లో యాభై రోజులుగా ఆడుతూనే ఉంది. ఇంత లాంగ్‌ ర‌న్‌ లో స‌క్సెస్‌ ఫుల్‌ గా ఆడిన సినిమా ఇదే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. చూస్తుంటే ఈ వ‌సూళ్ల జోరు మ‌రికొన్ని రోజులు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. శ్రీమంతుడుకి వచ్చిన బిజినెస్ లోనూ, లాభాల్లోనూ మ‌హేష్ వాటాను తీసుకున్నాడు. శాటిలైట్ - ఓవర్సీస్ - ఇండియా ఇలా అన్ని కలుపుకొని శ్రీమంతుడుకి క‌నీవినీ ఎరుగ‌ని ప్రాఫిట్స్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమాని హిందీవాళ్లు కూడా అడుగుతున్న‌ట్టు స‌మాచారం. అదే నిజ‌మైతే రీమేక్ రైట్స్ రూపంలో మ‌రిన్ని డ‌బ్బులొస్తాయి. అంతగా లాభాలు తెచ్చిపెట్టింది కాబ‌ట్టే మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుడు శివ కొర‌టాల‌కి 50ల‌క్ష‌ల విలువ చేసే ఆడి ల‌గ్జ‌రీ కారును గిప్ట్‌ గా ఇచ్చాడు. శ్రీమంతుడు అని ఏ టైమ్‌ లో పేరు పెట్టారో తెలియ‌దు కానీ... నిజంగానే మ‌హేష్‌ ని శ్రీమంతుడిని చేసింది ఆ సినిమా. నేడే యాభై రోజులు పూర్తి చేసుకొంటున్న శ్రీమంతుడు దిగ్విజ‌యంగా వంద రోజులు ఆడాల‌ని కోరుకొందాం. ఎందుకంటే అదొక మంచి సినిమా కాబ‌ట్టి!