Begin typing your search above and press return to search.
రెండోసారి కాలరెత్తిన మహర్షి
By: Tupaki Desk | 16 May 2019 5:28 AM GMTఏమో మహేష్ కు చుట్టూ ఉన్న వాళ్ళు మసాలాలు జోడించి బాహుబలి రేంజ్ లో మహర్షి ఆడుతోందని చెబుతున్నారో లేక ట్రేడ్ కోట్ల రూపాయల లాభాలు కళ్ళచూడబోతోంది అని పదే పదే ఊరించి వాయిస్తున్నారో తెలియదు కాని ఎన్నడూ లేని రీతిలో తమ హీరో బాడీ లాంగ్వేజ్ లో ఇన్ని మార్పులు రావడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.
నిర్మాతను కౌగిలించుకోవడం దర్శకుడికి ముద్దులు పెడుతూ ఫోటోలు దిగడం పబ్లిక్ స్టేజి మీద కాలర్ ఎగరేయడం ఇవన్ని కొత్తగా కొందరికి వింతగానూ అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు దీని మీద మంచి క్లారిటీ ఉంది. ఇక మహేష్ సినిమాలకు బ్లాక్ బస్టర్ అడ్డాగా పేరున్న సుదర్శన్ ధియేటర్ ని నిన్న సాయంత్రం హీరో టీం తో సహా సందర్శించాడు
ఫాన్స్ కోలాహలం మధ్య కాసేపు చూసి మధ్యలో మాట్లాడుతూ మరోసారి కాలర్ ఎగరెయ్యడం కొత్త చర్చకు దారి తీసింది. ఇలా పదే పదే ఒకే చర్యకు పూనుకోవడం మహేష్ ఎప్పుడూ చేయలేదు. మహర్షి కెరీర్ బెస్ట్ గ్రాస్ లేదా షేర్ తీసుకురావడం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉన్నా ప్రిన్స్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటం ప్రమోషన్ లో భాగమా లేక తన పిఆర్ టీం నుంచి వస్తున్న స్పష్టత లేని ఫీడింగా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే మహర్షి టీం ఇలా సక్సెస్ మీట్ లంటూ విజిట్ లంటూ వారం తిరక్కుండానే చాలా హంగామా చేసింది. వీక్ డేస్ వసూళ్లలో డ్రాప్ ఉండటం వల్లే ఇలా వేగం పెంచారనే టాక్ ఉంది. మొత్తానికి వంద కోట్ల షేర్ దాటితేనే మహర్షి విషయంలో మహేష్ చేసిన ప్రతి పనికి సమర్ధన చేసుకోవచ్చు. ఆ ఫిగర్ లో తేడాలు వస్తే మాత్రం ట్రోల్స్ తప్పవు