Begin typing your search above and press return to search.
రవి వద్దన్నది మహేష్ ఎస్ అంటాడా?
By: Tupaki Desk | 23 July 2018 7:23 AM GMTఒకప్పుడు వరస బ్లాక్ బస్టర్ల తో స్టార్ హీరోలను సైతం వెయిట్ చేసే రేంజ్ నుంచి తనను తాను అర్జెంటుగా ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజికి వచ్చేసిన దర్శకుడు శీను వైట్ల తన ఫోకస్ మొత్తం రవితేజతో తీస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ మీదే పెట్టాడు. వరసగా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ తో షేక్ చేస్తున్న మైత్రి సంస్థ కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. అమెరికాలో కీలకమైన షెడ్యూల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కేవలం చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కే ఓ 20 రోజుల దాకా షూటింగ్ ఉందట. అదేంటి ఫ్లాష్ బ్యాక్ కోసం అన్ని రోజుల షూటింగ్ ఎందుకు అనే అనుమానం రావొచ్చు. కానీ చాలా కీలకంగా అనిపించే ఆ సీన్స్ పర్ఫెక్షన్ కోసం శీను వైట్ల ఎంచుకున్న లొకేషన్స్ లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆమాత్రం టైం అవసరం పడుతోందట. కానీ అక్కడే ఒక చిక్కు ఉంది. రవితేజ చిన్ననాటి ఎపిసోడ్ లో నటించేందుకు ఓ పది లేదా పదిహేను ముందు వయసున్న చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి. కాస్త బ్రాండ్ ఉన్న కుర్రాడు అయితే బాగా కనెక్ట్ అవుతుంది.
అందుకే శీను వైట్ల బాగా అలోచించి మహేష్ బాబు కొడుకు గౌతమ్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో సంప్రదించాడట. కానీ చదువు కీలక దశలో ఉన్న గౌతమ్ ని ఇప్పుడు షూటింగ్ ల కోసమని అందులోనూ విదేశాలలో తిప్పితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఫ్రెండ్ షిప్ కొద్ది శీను అడిగినా మహేష్ మాత్రం సున్నితంగా నో చెప్పినట్టు ఫిలిం నగర్ గాసిప్. నిజంగా అడిగాడా లేదా అనే నిర్ధారణ లేదు. నిజానికి ఇదే పాత్ర కోసం రవితేజ కొడుకు మహాధన్ తో చేయించాలనే ప్రపోజల్ కూడా వచ్చిందట. ఎలాగూ రాజా ది గ్రేట్ లో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ ప్రారంభానికి ముందే రవితేజ ఓ ఇంటర్వ్యూ లో అబ్బాయిని కొన్నేళ్ల పాటు చదువు పూర్తయ్యే దాకా సినిమాలకు దూరంగా ఉంచుతున్నట్టు స్పష్టం చేసాడు. సో రవితేజ మహేష్ బాబుల ఉద్దేశాలు ఒకటే అయినప్పుడు సమాధానం వేరుగా ఎలా వస్తుంది. అందుకే శీను వైట్ల మరో బెటర్ ఆప్షన్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్ వేటలో పడ్డాడట.