Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో మహేష్ బాబు చుట్టరికం

By:  Tupaki Desk   |   7 Dec 2015 10:30 PM GMT
చంద్రబాబుతో మహేష్ బాబు చుట్టరికం
X
తెలుగుదేశం పార్టీతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దగ్గరి సంబంధమే ఉంది. మహేష్ బావ గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ తరఫున గుంటూరు పార్లమెంట్ సభ్యుడు. టీడీపీతోను - ఏపీ సీఎం చంద్రబాబు తోను ఇప్పుడు మహేష్ బాబు మరింత దగ్గరవుతున్నారు.

ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కొడుకు.. అంటే కృష్ణ సోదరుడి కుమారుడు రత్నబాబుకి పెళ్లి నిశ్చయమైంది. వధువు ఎవరో కాదు.. చంద్రబాబు నాయుడు సోదరి హైమావతికి మనుమరాలు ప్రియాంక. వీరిద్దరి నిశ్చితార్ధం రీసెంట్ గానే అంగంరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారా ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి దాదాపు అందరూ హాజరయ్యారు. ఈ నెల 25న హైద్రాబాద్ లో రత్నబాబు, ప్రియాంకల పెళ్లి వేడుక జరగనుంది.

ఈ వివాహానికి హాజరు కావాలంటూ.. కృష్ణ, ఆదిశేషగిరిరావులు ఇప్పటికే చంద్రబాబు నాయుడును కలిసి ఆహ్వానించారు కూడా. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకానున్నారు. ఏమైనా.. సినీ రంగంలో బాబు, పొలిటికల్ బాబు.. ఇద్దరూ ఒక పెళ్లితో బంధువులుగా మారడం మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి.