Begin typing your search above and press return to search.

కన్నతల్లిని గుర్తుచేసుకున్న సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   20 April 2020 9:30 AM GMT
కన్నతల్లిని గుర్తుచేసుకున్న సూపర్ స్టార్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు చాలా విలువైన రోజట. కారణం ఈరోజు తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు. కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతేగాక 'ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు' అంటూ తన తల్లి అపురూప చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. ఆయన తల్లి ఇందిరాదేవి ఏప్రిల్ 20వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే అమ్మ.. ఈ రోజు నా జీవితంలో గొప్ప రోజు.. అంటూ కాప్షన్ లో మెన్షన్ చేసాడు. ఇందిరాదేవి గారికి సూపర్ స్టార్ కృష్ణతో 1961లో పెళ్లైంది. ఇందిరాదేవి కృష్ణకు మరదలు అవుతుందట.

నిజానికి మహేష్ బాబు తల్లి ఇందిరదేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో తండ్రి కృష్ణ, విజయనిర్మల - మహేష్ బాబు సోదరుడు - సోదరీమణులు కనిపిస్తారు కానీ తల్లి ఇందిరాదేవి కనిపించిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. కృష్ణ - ఇందిరాదేవిలకు ఇద్దరు కొడుకులు - ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో నటించి మానేసిన సంగతి తెలిసిందే. చిన్న కొడుకైన మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా - అగ్ర హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నాడు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే దర్శకుడు పరశురాంతో ఓ సినిమా దాదాపు ఖరారు అయిందని సమాచారం. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.