Begin typing your search above and press return to search.

సరిలేరు కు 40+ కోట్ల రెమ్యూనరేషన్!

By:  Tupaki Desk   |   12 Dec 2019 6:23 AM GMT
సరిలేరు కు 40+ కోట్ల రెమ్యూనరేషన్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్.. పైగా సంక్రాంతి రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కు మహేష్ కు ఎంత పారితోషికం అందుకున్నారు అనేది చాలా రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే.

'సరిలేరు నీకేవ్వరు' రెమ్యూనరేషన్ కింద మహేష్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారట. ఈమధ్యే శాటిలైట్.. డిజిటల్.. హిందీ డబ్బింగ్ హక్కులకు సంబంధించిన డీల్స్ క్లోజ్ అయ్యాయని సమాచారం. సన్ టీవీ వారు శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్ ను జాయింట్ గా రూ.30 కోట్లకు తీసుకున్నారట. హిందీ డబ్బింగ్ హక్కుల డీల్ రూ. 15 కోట్లకు ఫైనలైజ్ అయిందట. ఇతర రైట్స్ విలువ మరో కోటి వరకూ ఉందట. అంటే ఈ రైట్స్ అన్నిటిని కలిపితే 46-47 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. జీఎస్టీ ను మినహాయించుకుంటే మహేష్ దాదాపు 41 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటారట.

మహేష్ బాబు కెరీర్ లో ఇది హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని సమాచారం. నిజానికి ఈ పారితోషికం యాభై కోట్ల కు పైచిలుకు ఉండేదని.. ఈమధ్య శాటిలైట్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ డిమాండ్ కొంత తగ్గింది కాబట్టి ఆ మేరకు మహేష్ పారితోషికం తగ్గిందని అంటున్నారు. ఏదేమైనా రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ సూపర్ స్టార్ అనిపించాడని కామెంట్ వినిపిస్తోంది.