Begin typing your search above and press return to search.
ఒక్క సినిమాతోనే మహేష్ 22 కోట్లు
By: Tupaki Desk | 6 Aug 2015 3:58 PM GMTటాలీవుడ్ లో ఇంతవరకూ టాప్ రెమ్యునరేషన్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా వీజీ. ఇంతవరకూ భారతదేశంలోనే నంబర్ -1 వసూళ్ల సినిమాగా పేరు తెచ్చుకున్న బాహుబలిలో నటించినందుకు ప్రభాస్ కి 25కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమాకి సంబంధించినంతవరకూ ఇదే టాప్ -1 రెమ్యునరేషన్. పవన్ కల్యాణ్, మహేష్ రేంజ్ 20కోట్లకు అటూ ఇటూగా ఉంది. బాహుబలి రిలీజ్ ముందు వరకూ ఈ ఇద్దరిదే టాప్ వన్ పొజిషన్. మరి ఇప్పుడు ప్రభాస్ ఆ రేంజుకి వచ్చేశాడు.
అయితే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఏకంగా మూడేళ్ల పాటు కాల్షీట్లు కేటాయించాడు. అన్నేళ్లు నటిస్తే అతడికి దక్కింది రూ.25కోట్లు. కానీ మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలు ఏడాది కాలంలోనే సినిమా పూర్తి చేసి 20కోట్లు పైగా అందుకుంటున్నారు. అంటే మూడేళ్లలో ఏడాదికో సినిమా చేసినా రూ.60కోట్లు పైగానే సంపాదించేస్తారన్నమాట. అయినా బాహుబలి జోనర్ ని, ప్రభాస్ ని ఇతరులతో పోల్చడం సరికాదు. ఈ టీమ్ ఓ బృహత్తరమైన ప్రయత్నం చేసి ఘనవిజయం సాధించింది. తెలుగు సినిమాకి ఓ సరికొత్త దారి చూపించింది. అందుకు మహేష్ వంటి స్టార్ హీరోలు స్వాగతం పలికారు. ఈ పరిణామం వల్ల అందరి సినిమాలకు వసూళ్లు పెరుగుతాయి. పారితోషికాల రేంజు కూడా మారిపోతుంది అంటూ మహేష్ సూత్రీకరించాడు. అదీ నిజమే కదా!